పవన్ అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారు

Pawan has been accused of misinformation

Pawan has been accused of misinformation

Date:15/03/2018

పలమనేరు ముచ్చట్లు:

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన రాజకీయ మనుగడకోసమే తెదేపా పై అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నారని తెదేపా జిల్లా అధికార ప్రతినిధి బాలాజీనాయుడు ఆన్నారు. గురువారం స్థానిక తెదేపా కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలకోసం ప్రజలు, నాయకులు పార్టీలకతీతంగా ప్రత్యేక హోదాకోసం పోరాడుతున్నవేళ పవన్ ఈ విషయాన్ని విస్మరించి, జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం పై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆవేశంగా అరిచినంతమాత్రాన అబద్దాలు నిజాలు కావని తెలిపారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకుంటున్న పవన్ ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా పై మోదీని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. పవన్ ప్రత్యేక హోదా సాధన కోసం మాట్లాడకపోగా సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగే అవినీతిని అరికట్టేందుకు 1100 టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేయడంలో తెదేపా సఫలమైందని పేర్కొన్నారు. జియో ట్యాగింగ్, ఇసుక ఉచిత విధానాలే ఇందుకు నిదర్శనమన్నారు.అవినీతి నిర్మూలనలో ఏపీ మొదటి స్థానం నుండి 13 వ స్థాయికి తగ్గిందని ఎన్సీఏఈఆర్ నివేదిక ప్రకటించడాన్ని పవన్ తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పోరాటాన్ని నీరుగార్చే పనులు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పలమనేరు, గంగవరం మండలాల నాయకులు జగదీష్ నాయుడు, ప్రసాద్ నాయుడు, వెంకట్రమణారెడ్డి, సోమశేఖర్, మురళి, హరిబాబు, గుణశేఖర్ రెడ్డి, రహీంబాషా, ఖాజా, కిరణ్ రాయల్, మల్లీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Pawan has been accused of misinformation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *