అన్నగారి బాటలోనే పవన్ 

Pawan is on the path of Anna

Pawan is on the path of Anna

Date:11/10/2018
ఏలూరు  ముచ్చట్లు:
అన్నగారు కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చేశారు కదా.. పవన్ పార్టీ పెట్టి అయిదేళ్లయినా.. కనీసం దానిని ట్రాక్ మీదికి తెచ్చి కూడా ఇప్పటికే ఆరునెలలు దాటిపోతున్నది కదా.. మరి ఏ రకంగా ఎన్టీఆర్ ను తలదన్నుతారబ్బా అని ఎవరికైనా ఆశ్చర్యం కలగొచ్చు. అధికారంలోకి వచ్చే విషయంలో పవన్ కల్యాణ్ ఈ మాట అనడంలేదు లెండి! నిజానికి అచ్చంగా అధికారంలోకి వచ్చేస్తామనే నమ్మకం ఆయనలో కూడా లేదు. కాకపోతే.. వస్తే గిస్తే.. ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ రూపాయి కూడా తీసుకోకుండా రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు.అప్పట్లో ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు నెలకు ఒక్కరూపాయి జీతం తీసుకుని సీఎంగా పనిచేశాడు. పవన్ కల్యాణ్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేస్తా అంటున్నాడు.  ముఖ్యమంత్రి పదవి అనేది చంద్రబాబు కుమారుడికి, మనుమడికి, జగన్ కు వారసత్వమేమో గానీ.. తనకు మాత్రం బాధ్యత అని అందుకే అంత నిస్వార్థంగా పనిచేస్తానని పవన్ అంటున్నాడు.
పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ మరోసారి చింతమనేని ప్రభాకర్ పై దండెత్తారు. వారం రోజుల్లోగా చింతమనేనిని విప్ పదవినుంచి తొలగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తొలగించకపోతే.. ఆయన మీద ఎస్సీ ఎస్టీ కమిషన్ కు, గవర్నర్ కు తానే ఫిర్యాదు చేస్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.జనసేన విజయం సాధిస్తుందని భయపడి.. చంద్రబాబునాయుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. పంచాయతీల్లో గ్రామాల్లో జనసేన పార్టీ చాలా బలంగా ఉన్నదని, జనసేన గెలిస్తే తన పరువు పోతుందని చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు.తనకు నలుగురు పిల్లలున్నారని, సర్పంచి ఎన్నికలకు తాను అనర్హుడినని, చంద్రబాబు ధైర్యంగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని కూడా  పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అయినా పవన్ కల్యాణ్ ఒక్కడూ ఒకవేళ సర్పంచిగా నిలబడి ఒక పంచాయతీలో గెలవడం గురించి ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు చెప్మా?
Tags:Pawan is on the path of Anna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *