Date:04/12/2020
చిత్తూరు ముచ్చట్లు:
నివార్ తుఫాన్ లో ఉన్న రైతులు పరామర్శించడానికి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పోయ్య గ్రామానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రావొద్దు అంటూ వైకాపా నేతలు అడ్డుకున్నారు. దీంతో వైకాపా నాయకులు, జనసేన నాయకుల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పారు గో బ్యాక్ పవన్ కళ్యాణ్ అంటూ వైకాపా నాయకులు నినాదాలు చేసారు. పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకునే దిశగా అధికార పార్టీ నాయకులు గ్రామంలో రైతులను బెదిరించారని జనసేన పార్టీ ఇంచార్జ్ నగరం వినుత ఆవేదన వ్యక్తం చేశారు.
పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్
Tags: Pawan Kalyan did not come