రైతుల సమస్యలపై పవన్ కళ్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష

Pawan Kalyan Farmer's well-being on farmers' issues

Pawan Kalyan Farmer's well-being on farmers' issues

Date:12/12/2019

కాకినాడ ముచ్చట్లు:

ధాన్యం రైతుల సమస్యలకు పరిష్కారం కోరుతూ, జగన్ రెడ్డి సర్కారు వైఖరిపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షకు దిగారు. . కాకినాడలోని జేఎన్టీయూ ఎదురుగా ఐ.టి.ఐ పక్కన ఏర్పాటు చేసిన దీక్ష శిబిరానికి ఉదయం 8 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ నాగబాబు చేరుకున్నారు.మహిళలు హారతులు పట్టగా రైతులు పూల మాల వేసి ఆయనను వేదిక మీదకు ఆహ్వానించారు. రైతు దీక్షకు సంకేతంగా రైతులు, పార్టీ నాయకులు పచ్చని కండువాను కప్పి, వరి కంకులు బహుకరించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న జనసైనికులు, నాయకులు, రైతులకు అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ దీక్షకు కూర్చున్నారు.ఆయనతో పాటు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు, తూర్పు గోదావరి జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు  చెందిన నాయకులు, రైతు సంఘాల నేతలు వేదికపై దీక్షలో కూర్చొని సంఘీభావం తెలిపారు. మరో వైపు జనసేనాని దీక్షకు జన సైనికులు, రైతులు భారీగా తరలి వచ్చారు.రాష్ట్ర నలుమూలల  నుంచి లక్షలాది జన సైనికులు కాకినాడ చేరుకొని నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు.

 

కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా

 

Tags:Pawan Kalyan Farmer’s well-being on farmers’ issues

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *