పవన్ కళ్యాణ్ పుట్టుకతోనే పిచ్చోడు..
సూట్ కేసుల కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నాడు
– ఎమ్మెల్యే ప్రసన్న ఫైర్
నెల్లూరు ముచ్చట్లు:
చంద్రబాబు,పవన్ కళ్యాణ్ పండగలప్పుడు వచ్చే పగటి వేషగాళ్ల లాంటి వారిని కోవూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎద్దేవ చేశారు. కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం గ్రామంలో ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పుట్టుకతోనే పిచ్చోడని.. ఆయనకు రాజకీయ లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు. పవన్ చంద్రబాబు ఇంట్లో ఆయన కాళ్లు పట్టుకొని సూట్ కేసులు తీసుకున్నారని ఆరోపించారు. అసలు పవన్ కళ్యాణ్ తన పార్టీ 175 సీట్లకు పోటీ చేస్తుందో లేదో చెప్పాలని అన్నారు. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ఎన్ని కుట్రలు చేసినా… రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డే ఉంటారని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: Pawan Kalyan is crazy by birth..
