వారాహి దీక్షోద్వాసన గావించిన పవన్ కళ్యాణ్

అమ‌రావ‌తి ముచ్చట్లు:

 

స‌మాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి ఏకాదశ దిన దీక్ష వారాహి అమ్మ వారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో పరిసమాప్తమైంది. ప్రదోష కాలాన వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ దీక్షాబద్ధులైన పవన్ కళ్యాణ్ వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏక హారతి, ద్వి హారతి, త్రి హారతి, చతుర్ధ, పంచ, నక్షత్ర హారతులు అమ్మవారికి సమర్పించారు. చివరిగా కుంభ హారతితో వారాహి ఏకాదశ దిన ఆరాధన సంపూర్ణం అయ్యింది. వేద పండితులు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ, హరనాథ్ శర్మ, వేణుగోపాల శర్మ పూజా క్రతువు పూర్తి చేసి ఆశీర్వచనాలు అందచేశారు.పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష చేయనున్నారు. గృహస్తాచార రీతిలో ఈ దీక్షను తలపెడుతున్నారు. అధికార కార్యకలాపాలను కొనసాగిస్తూనే శుభ తిధుల్లో మాత్రం దీక్ష వస్త్రాలను ధరిస్తారు. దీక్షా కాలంలో పరిమిత సాత్వికాహారం మాత్రమే స్వీకరిస్తారు.

 

 

Tags:Pawan Kalyan sang Varahi Dikshodwasana

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *