పవన్ కళ్యాణ్ నటించారు : టీడీపీ ఎమ్మెల్సీ  దీపక్ రెడ్డి 

Date:16/03/2018
అమరావతి ముచ్చట్లు:
పవన్ కళ్యాణ్ గారు రెండు రోజుల క్రితం మాట్లాడిన మాటలకు మా తెలుగుదేశం పార్టీ ఇంతగా రియాక్ట్ కావలసిన అవసరం లేదని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు అయన అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు.  వాక్కు స్వాతంత్ర్యం ఉంది కాబట్టి మాట్లాడాడు.  వాస్తవం గా అది ఒక సినిమా అని, పవన్ కళ్యాణ్ నటించాడు అని నేను భావిస్తున్నాను. కళాకారులు రకరకాల సినిమాలు చేస్తారని అన్నారు.  పవన్ కళ్యాణ్ కు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే ముగ్గురు శక్తులు ఎవరు అనే విషయం ప్రజలకు తెలుసని అయన అన్నారు.  ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండి ప్రస్తుతం కాళీగా ఉన్న వ్యక్తి స్క్రీన్ ప్లే వ్రాస్తే, ప్రస్తుతం నడుచుకుంటూ పోతున్న వ్యక్తి డైరెక్షన్ చేసాడు. నిర్మాత ఎవరో అందరికీ తెలుసు అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్, జగన్, బీజేపీ లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Tags: Pawan Kalyan starred: TDP MLM Deepak Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *