కేసీఆర్‌ స్ట్రాటజీతో పవన్‌ కల్యాణ్

విజయవాడ ముచ్చట్లు:


ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన తాజా వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.. పీఏసీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ విముక్త ఏపీ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు.. అయితే, మా వ్యూహాలు మాకున్నాయి.. పరిస్థితులను బట్టి వ్యూహాలు మారుతుంటాయి.. అవసరాన్ని బట్టి వ్యూహాలు మార్చుకుంటామని ప్రకటించారు పవన్‌.. అంతటితో ఆగకుండా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రస్తావన తీసుకొచ్చారు జనసేనాని.. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్‌ను కలిపేస్తానని కేసీఆర్ చెప్పారు.. కానీ, ఆ తర్వాత మనసు మార్చుకున్నారు.. అది వారి వ్యూహం.. అలాగే పార్టీలో మా వ్యూహాలు మాకుంటాయని తెలిపారు. దీంతో, పవన్‌ కల్యాణ్‌ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు..? అనే చర్చ మొదలైంది.తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను కలిపేస్తానని కేసీఆర్ చెప్పారు. కానీ, ఆ తర్వాత మనసు మార్చుకున్నారు.. అది వారి వ్యూహం.. మొత్తం ఫ్యామిలీతో వెళ్లి సోనియా గాంధీని కలిశారు.. మరి ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు.. కానీ, ఒంటరిగా పోటీ చేశారు.. రిస్క్‌ తీసుకుని ముందుకు వెళ్లారు.. మన వ్యూహాలు కూడా అలాగే ఉంటాయన్నారు పవన్‌ కల్యాణ్‌.. మనం బీజేపీతో కలిసి వెళ్తామా? తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా?.. బీజేపీ, టీడీపీతో కలిసి పనిచేస్తామా? టీడీపీతో కలిసి వెళ్లమా? అనే ఇప్పుడు బయట పెట్టలేను.. పరిస్థితులను బట్టి వ్యూహాలు మారుతూనే ఉంటాయన్నారు. కానీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేక ఓటు చీలకూడదనే బేసిక్ పాయింటుతోనే మా వ్యూహాలు ఉంటాయని స్పష్టం చేశారు పవన్‌ కల్యాణ్… ఇక, పాదయాత్ర చేసిన వారందరూ వినోభా భావేలు కారు.. పాదయాత్ర చేసిన వారు ఆంధ్రా థానోస్ గా మారిన వాళ్లూ ఉన్నారని ఎద్దేవా చేసిన ఆయన.. నన్ను విమర్శించే ధర్మాన కానీ.. ఇతరులు కానీ..

 

 

 

నాతో పాదయాత్రలో పది అడుగులు వేయాలని కోరుకుంటున్నాను అన్నారు.. మరోవైపు, పాదయాత్ర వల్ల సీఎంలు కారు.. నితీష్ కుమార్ ఏ పాదయాత్ర చేసి సీఎం అయ్యారు..? నితీష్ కుమార్ నాలుగు గోడల మధ్యన కూర్చొని వేసిన వ్యూహాలతో సీఎం అయ్యారని గుర్తుచేశారు.. పాదయాత్ర చేయకుండానే ఏక్ నాథ్‌ షిండే తరహాలో సీఎం కావొచ్చు అని వ్యాఖ్యానించారు.. మూడో ప్రత్యామ్నాయం ఉండడం దేశానికి కానీ.. రాష్ట్రానికి కానీ చాలా అవసరమని మరోసారి తన అభిప్రాయాన్ని స్పష్టంగా వినిపించారు. బీజేపీకి నచ్చినా.. నచ్చకున్నా.. మూడో ప్రత్యామ్నాయం ఉండాల్సిందే అన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీకి పొత్తు ఉంది.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్పితే.. కలిసి కార్యక్రమాలు నిర్వహించేస్థాయిలో ఏకపోయినా.. ఎన్నికల్లో అవగాహనతో ముందుకు వెళ్తున్నారు.. మరోవైపు, పవన్‌ కల్యాణ్ ఎప్పుడూ.. టీడీపీ, చంద్రబాబుకు మేలు చేసేలా పనిచేస్తారని అధికార వైసీపీ ఆరోపణలు చేస్తూనే ఉంది.. మొత్తంగా వైసీపీ వ్యతిరేక స్టాండ్‌తో ముందుకు వెళ్తున్న పవన్‌ కల్యాణ్.. ఆయన వ్యూహాలు ఎక్కడ అమలు చేస్తారు? ఎవరిపై ప్రయోగిస్తారు? అనే చర్చ సాగుతోంది. గతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామని ప్రకటించారు పవన్.. ఇప్పుడు వైసీపీ విముక్త ఏపీ అనే నినాదం అందుకున్నారు. ఇందులో ఎలాంటి మార్పు లేదు. కానీ, బీజేపీతో పొత్త విషయంలో ఆయన వ్యూహం మారుతుందా..? టీడీపీ విషయంలో కొత్త వ్యూహాలు ఉన్నాయా? అనే తేలాల్సి ఉంది. ఇక, ఎన్నికలు వస్తే.. ఏపీలో ఇంకా ఎలాంటి పరిస్థితులు వస్తాయో వేచి చూడాలి.

 

Tags: Pawan Kalyan with KCR strategy

Leave A Reply

Your email address will not be published.