Natyam ad

ఈనెల నుంచే రోడ్లపైకి వారాహి, రూట్ మ్యాప్ సిద్ధం చేసిన పవన్ కళ్యాణ్!

అమరావతి ముచ్చట్లు:


జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనం వారాహి. ఈ ప్రచార వాహనంతో ప్రజల్లోకి రావాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఈ మేరకు వారాహి రూట్ మ్యాప్ సిద్ధం చేసింది జనసేన. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. వారాహి రూట్ మ్యాప్ వివరాలను వెల్లడించనున్నారు.
పవన్ కళ్యాణ్ త్వరలో చేపట్టే వారాహి యాత్రపై ఉభయ గోదావరి జిల్లాల పార్టీ అధ్యక్షులు, పి.ఎ.సి. సభ్యులతో మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ శుక్రవారం సమావేశమై చర్చించారు. పవన్ యాత్రకు ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని జనసేన శ్రేణులకు నాదెండ్ల సూచించారు. ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం పవన్ కల్యాణ్ వారాహి వాహనం తయారుచేయించారు. ప్రచార వాహనం వారాహితో పవన్ ప్రజల్లోకి వెళ్తారని జనసేన నేతలు పలుమార్లు చెప్పారు. కానీ అందుకు అనువైన సమయంగా భావించి త్వరలోనే వారాహితో పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లనుండటంపై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జిల్లాలతోనే పవన్ వారాహి అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

 

Tags: Pawan Kalyan has prepared a route map for Varahi on the roads from this month!

Post Midle
Post Midle