Natyam ad

పవన్ కళ్యాణ్  జన్మదిన వేడుకలు

సత్యవేడు ముచ్చట్లు:

సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో జనసేన నాయకుల ఆహ్వానం మేరకు అధినేత   పవన్ కళ్యాణ్  జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి   వినుత కోటా.
జనసేనాని జన్మదిన సందర్భంగా వరదయ్యపాలెంలో మండల అధ్యక్షులు  చిరంజీవి యాదవ్  ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా సంత సంతవేలూరు లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బారీ కేక్ కట్ చెయ్యడం జరిగింది. రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి రక్తదానం చేసిన జనసైనికులకు వినుత చే సర్టిఫికేట్ పత్రాలు అందజేశారు. జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలకు నగదు మరియు ట్రోపి కప్పులను ఈరోజు వినుత కోటా  చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా బలంగా పార్టీ కార్యక్రమాలు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రతి ఒక్క నాయకులను , కార్యకర్తలను అభినందిస్తూ , ప్రతి ఒక్క కార్యకర్త కి పార్టీ నాయకులు పూర్తి అండగా ఉంటారని వినుత బరోసా ఇచ్చారు.

Post Midle

Tags: Pawan Kalyan’s birthday celebrations

Post Midle