పవన్..వాస్తవాలు తెలుసుకో-మంత్రి కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం ముచ్చట్లు:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రణస్థలంలో నిర్వహించిన యువశక్తి సభపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. పవన కళ్యాణ్ మాట్లాడిన మాటలు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ లాగి ఉంది. ఒకదానితో ఒకటి పొంతన లేదు. ప్రజారాజ్యం మూసేసినపుడు, జనసేన పెట్టిన్నపుడు మాట్లాడిన మాటలకు ఈరోజు మాట్లాడే మాటలకు అసలు సంబంధం లేదు. స్వామి వివేకానంద సూచించిన 100మంది చాలు దేశాన్ని మారుస్తా అంటూనే, నీచంగా బూతులు బహిరంగ సభల్లో మాట్లాడుతున్నావని విమర్శించారు. సజ్జల సలహా వింటే నాశనం అంటున్నావు నీవు తీసుకుంటున్న నాదెళ్ల సలహాలు తీసుకుంటూ నువ్వేం చేస్తున్నావ్. యువతను రౌడీలుగా, గుండాలుగా తయారవ్వమని చెప్తున్నావ్ కానీ చాడువుకోమని, మంచిగా ఉండడని మాత్రం చెప్తున్నవా?? నీ జేబులో నుండి చంద్రబాబు స్క్రిప్ట్ తీసి చదువుతున్నావా అని ప్రశ్నించారు.
పెళ్లి బీజేపీ తో, కాపురం తెలుగుదేశం పార్టీతో చేస్తూ మూడు ముక్కలాట ఆడుతుంది నువ్వే. సభకు వచ్చిన వాళ్ళందరిని రెచ్చగొట్టి రౌడీల్లాగా మారుస్తావా. 2019 నుండి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఏంటో చూసావా. విద్యకు ప్రాధాన్యత వైఎస్ రాజశేఖరరెడ్డి పెద్దపీట వేసి ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా అందర్నీ చదివిస్తే నీ స్నేహితుడు చంద్రబాబు మొత్తం ఆపేశాడు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కాలేజీలకు పెట్టిన బకాయిలు కూడా చెల్లించి విద్యను అందిస్తున్నారు. ఆరోగ్య శ్రీ ని నామాటగా ఓటెయ్యమన్న తెలుగుదేశం ప్రభుత్వం నీరుగార్చేస్తే అప్పుడు నిద్ర పోయావా. తెలుగుదేశం పార్టీ ఆరోగ్య శ్రీకి పెట్టిన 800కోట్లు బకాయిలు తీర్చి, ప్రస్తుతం సమవర్ధవంతంగా నిర్వహిస్తుంది ఎవరో తెలీదా. వాడిని ఎవరికైనా చూపించాంద్రా బాబు అనే సినీమా డైలాగ్ నీకు సూట్ అవుతుంది. నీవు రెచ్చగొట్టే కార్యకర్తలు ఎక్కడ గొడవ పడినా వాళ్ళే ఉంటున్నారు. లా అండ్ ఆర్డర్ కి విఘాతం కలిగిస్తే ఏ పార్టీ వారైనా కేసులు పెడతారు. ఈరోజు వివేకానంద గురించి ఒక్క మాటైనా మాట్లాడవా. ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ కోసం ఉత్తరరంద్రా డేవాలల్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తావా? చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రలో ఒక్క ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేశారా? జగన్మోహన్ రెడ్డి 7 ఫిషింగ్ హర్బర్ లని నిర్మిస్తున్నారు. మిమ్మల్ని నమ్మితే మ్యూనిగిపోతావని నువ్వే చెప్తున్నావ్. ఈ సమాజం పట్ల నీకు ప్రేమ ఉంటే సినిమా డైలాగ్స్ మానేసి వాస్తవాలు తెలుసుకుంటే బాగుంటుందని అన్నారు.

పార్టీ పరంగా, కులం పరంగా, ప్రాంతాల పరంగా ఎవరికి సంక్షేమ పథకాలు అందటం లేదో ఒక్కరిని చూపించు. సింగిల్ గా వెళ్లే దమ్ము లేదని తేల్చేశావ్. ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం ఈ సభ ద్వారా ప్రయత్నం చేస్తున్నావా. సామాజిక వర్గాన్ని అడ్డ పెట్టుకుని ఆ సామాజిక వర్గన్నాయి పాడు చేసే విధంగా కృషి చేస్తున్నావ్. వివేకానంద జయంతి ఇచ్చే సందేశం యువతను యుద్ధాలు చేయాలని, జైళ్లకు వెళ్లాలని చెప్పాడమేనా నువ్విచ్చే సందేశం. నవరత్నాలు కంటే మెరుగ్గా చేస్తా అంటున్నావు. ఈ సంక్షేమ పథకాలు ఇస్తే అప్పుల పలు అవుతాదని చెప్పింది నువ్వేగా. ఎంత నీచానికి దిగజరిపోయి మాట్లాడుతున్నావ్. మూడు పెళ్లిళ్లు చేసుకోమని చెప్తున్నావ్ ఇదేనా ఈరోజు నువ్విచ్చే సందేశం. సినిమా డైలాగ్స్, చంద్రబాబు స్క్రిప్టు పట్టుకుని సభల్లో మాట్లాడితే ఇంకా పలుచ పడతావ్ తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. మన చిత్తశుద్ధిని ప్రజలు నమ్మితేనే ప్రజలు మనల్ని గెలిపిస్తారు తప్ప సన్నాసులు, వేదవలు అంటూ మాట్లాడితే జనం చూసి భయపడతారు. ఈరోజు నువ్వు చేసిన ఒక్క ఆరోపణ కూడా నిజం లేదు. వాస్తవాలు తెలుసుకో, నువ్వు పాడు చేద్దామన్నా పాడు అవడానికి ప్రజలు సిద్ధంగా లేరని అయన అన్నారు.
Tags; Pawan..Know the facts-Minister Kottu Satyanarayana
