పవన్ వర్సెస్ కన్నబాబు

Pawan vs. Kannababu

Pawan vs. Kannababu

Date:11/12/2019

విజయవాడ ముచ్చట్లు:

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు పై పగ ఇంకా చల్లారినట్లు లేదు. వీరిద్దరి నడుమ గత ఎన్నికల ముందు నుంచి నడుస్తున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరేలాగే కనిపిస్తుంది. ప్రజారాజ్యం పార్టీలో కాకినాడ రూరల్ నుంచి గెలిచి రాజకీయ అరంగేట్రం చేసిన కన్నబాబు ఆ తరువాత జనసేన లో చేరలేదన్న కోపం పవన్ కి పీకల్లోతు వుంది. దీంతో బాటు కన్నబాబు చిరంజీవి పై వత్తిడి తెచ్చి పార్టీని కాంగ్రెస్ లో విలీనం అయ్యేలా చేశారన్న ఎవరో ఇచ్చిన ఫీడ్ బ్యాక్ వల్లే పవన్ ఆయనపై కక్ష సాధింపు మొదలు పెట్టారని ప్రచారం నడుస్తుంది.ఎన్నికల్లో కన్నబాబు ఓటమికి తీవ్రంగా జనసేనాని శ్రమించారు. కాకినాడ రూరల్ ప్రాంతం ప్రచారం లోనే కాదు ఆంధ్ర్రప్రదేశ్ లో పలు సభల్లోనూ ప్రెస్ మీట్ల లో సైతం పదేపదే కన్నబాబు ను తిట్టిన తిట్టు తిట్టకుండా పవన్ తిట్టిపోసేవారు. అయినా కురసాల కన్నబాబు వైసిపి ప్రభంజనంలో గెలిచి జగన్ దృష్టిలో పడి మంత్రి కూడా అయ్యారు. పవన్ పదేపదే టార్గెట్ చేసినా గెలిచి నిలిచినందుకే జగన్ మోహన్ రెడ్డి ఆయనకు పెద్దపీట వేశారన్నది ఫ్యాన్ పార్టీలో వినిపించింది.జగన్ క్యాబినెట్ లో వ్యవసాయ మంత్రి అయ్యాకా కూడా కన్నబాబు తనదైన శైలిలో పనిచేసుకుపోయారు తప్ప విమర్శలు ఆరోపణలకు పెద్దగా మొదట్లో దిగింది లేదు. అయితే పవన్ తాను పోటీ చేసిన రెండుచోట్లా ఓడిపోవడం మరోపక్క టార్గెట్ చేసిన కన్నబాబు విజయం సాధించి మంత్రి కావడంతో అప్సెట్ అయ్యారు. పలు సందర్భాల్లో తిరిగి కన్నబాబును విమర్శించడం మొదలు పెట్టారు.

 

 

 

 

 

 

 

దాంతో కన్నబాబు సైతం అంతే స్థాయిలో పవన్ పై కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టేశారు. ఈ నేపథ్యంలో ఇరువురి నడుమ పార్టీల కన్నా వ్యక్తిగత యుద్ధం మొదలైందా అనే స్థాయిలో విమర్శలు ఆరోపణలు పెరుగుతూ పోయాయి.పవన్ ఎన్నికలు ముగిసిన తరువాత ఇసుక ఉద్యమం విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఆ తరువాత రైతు సమస్యల పై పోరాటం పేరుతో జిల్లాల యాత్ర మొదలు పెట్టారు. రైతు ల కోసం యాత్ర వెనుక టార్గెట్ కన్నబాబే అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. వ్యవసాయ మంత్రిగా కన్నబాబు వైఫల్యం చెందారు అనేందుకే ఈ అంశాన్ని పవన్ ఎంచుకున్నారన్న టాక్ వినవస్తుంది. వాస్తవానికి ప్రభుత్వం వచ్చి ఆరునెలలు కావొస్తుంది. గతంలో ఐదేళ్ళ టిడిపి సర్కార్ హయాంలో ఈ స్థాయిలో ఇసుక, రైతు సమస్యల అంశాలను ప్రస్తావించి పోరాటం చేయని పవన్ క్షేత్ర స్థాయిలో ఇప్పుడు మాత్రం ఉద్యమ బాట పట్టడం జగన్ సర్కార్ పై ఆగ్రహం, కన్నబాబు పై అక్కసు అంటున్నాయి వైసిపి వర్గాలు.ఈనెల 12వ తేదీ లోగా రైతు లకు గిట్టుబాటు ధర లభించకపోతే కాకినాడ కేంద్రంగా తాను ధర్నాకు దిగుతా అంటూ తూర్పుగోదావరి జిల్లా మండపేట లో పవన్ ప్రకటించారు. కాకినాడనే పవన్ ఎంచుకోవడం వెనుక కూడా రెండు కారణాలు కనిపిస్తున్నాయి.

 

 

 

 

 

 

 

జగన్ కి అత్యంత సన్నిహితుడు కాకినాడ అర్బన్ ఎమ్యెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర రెడ్డి మిల్లర్ల అసోసియేషన్ కు నాయకుడిగా వున్నారు. కాకినాడ రూరల్ నుంచి కన్నబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కనుక వీరిద్దరిని ఇప్పటినుంచి టార్గెట్ చేయడమే పవన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో గతంలో ప్రజారాజ్యం పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు విజయం సాధించారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలోని కొత్తపేట నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించారు. అయితే ఇంతబలమైన చోట తన అన్నయ్య తో ప్రయాణం చేసిన కన్నబాబు, వంగా గీత వంటి వారు తనతో ప్రయాణం చేసేందుకు రాకపోవడం జనసేన ఆ నియోజకవర్గాల్లో గట్టి దెబ్బ తగలడాన్ని ఇప్పటికి పవన్ జీర్ణించుకోలేక పోతున్నారు. దీనికి తోడు కన్నబాబు వంటివారివల్లే ఇదంతా జరిగింది అన్న బలమైన నమ్మకంతో పవన్ రాజకీయం నడుస్తున్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు.

 

దూకుడు పెంచిన డీకే అరుణ

 

Tags:Pawan vs. Kannababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *