పండ్ల తోటల సాగుపై శ్రద్ధ చూపాలి

Pay attention to the cultivation of fruit plantations.

Pay attention to the cultivation of fruit plantations.

Date:16/09/2018

– ఉద్యాన వాన శాఖ అధికారి కోటేశ్వర రావు.

పెద్దపంజాణి ముచ్చట్లు:

రైతులందరూ అరటి,బొప్పాయి,జామ,దానిమ్మ వంటి పండ్ల తోటల సాగుపై శ్రద్ద చూపాలని పుంగనూరు ఉద్యానవన శాఖ అధికారి కోటేశ్వర్ రావు సూచించారు. ఆదివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రైతులకు పండ్ల తోటల పెంపకం,సాగు అంశాలపై ఒక్క రోజు అవగాహనా కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండ్ల తోటలతో పటు కూరగాయల పంటలను పందిరి వేసి సాగు చేయాలని సూచించారు. అలాగే నీటిసంరక్షణ బిందు సేద్యం,జిబా పద్దతుల సాగు ను రైతులు అవలంబించాలని ఆయన పేర్కొన్నారు.

అధిక ఆదాయాన్నిచ్చే టిష్యు కల్చర్ పై ద్రుష్టి సారించాలని కోరారు. విశ్రాంత శాస్త్రవేత్త రామయ్య మాట్లాడుతూ మామిడి,జామ,టొమాటో పంటల సాగు, సస్యరక్షణ పద్దతులను వివరించారు. యూపీఎల్ కంపెనీ కి చెందిన జీబా మందు వాడకం గురించి తెలిపారు.

జీబా 400 రెట్లు నీటిని సంగ్రహించి మొక్కకు అందించి నీటి ఎద్దడి పరిస్థితులలో కాపాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనివాసులు,స్వప్న,రాసి,రైతులు పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్ పై కమలాపురం ఎస్సై దాడి

Tags:Pay attention to the cultivation of fruit plantations.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *