పుంగనూరులో వడ్డీలేకుండ ఆస్తిపన్ను చెల్లించండి
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని ఆస్తిపన్నులు వడ్డీ లేకుండ చెల్లించే సౌకర్యం ప్రభుత్వం కల్పించినట్లు కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటిలో వెహోత్తం పన్నులు రూ.5.22 కోట్లు వసూలుకావాల్సి ఉందన్నారు. ఇందులో రూ. 2.94 కోట్లు వసూలైందని ఇంకను రూ.2.28 కోట్లు వసూలుకావాల్సి ఉందన్నారు. ఇందులో సుమారుగా రూ. 86 లక్షలు వడ్డీని ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. పట్టణంలోని ఆస్తులు కలిగిన యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్వరమే వడ్డీలేకుండ పన్నులు చెల్లించాలని ఆయన కోరారు. ఈ మేరకు మున్సిపాలిటిలోని 16 సచివాలయాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. సచివాలయ సిబ్బంది తక్షణమే బకాయిదారులను గుర్తించి , వారికి రాయితీని వివరించి వసూలు చేస్తామన్నారు.

Tags: Pay property tax in Punganur without interest
