మిల్లు కార్మికుల బకాయి చెల్లించి వేలం వేయండి..

– యాజమాన్యం బకాయి చెల్లించకుండా వేలం వేయాలని చూస్తే అట్టుకుంటాం..
— మదనపల్లి స్పిన్నింగ్ మిల్స్ వర్కర్స్ యూనియన్..

 

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లి స్పిన్నింగ్ మిల్లులో పనిచేసిన పర్మనెంట్ కార్మికులకు రావాల్సిన రూ.9 కోట్ల బకాయి చెల్లించి, యాజమాన్యం మిల్లు లోని యంత్రాలు, ఇతర పరికరాలు వేలం వేసుకోవాలి.. బకాయి చెల్లించ కుండా వేలం వేస్తే అడ్డుకుంటామని మదనపల్లి స్పిన్నింగ్ మిల్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జేవి నరసింహమూర్తి, జాయింట్ సెక్రటరీ బి.రెడ్డప్పరెడ్డి హెచ్చరించారు. గురువారం వారు మదనపల్లి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ.. బిల్లులో పనిచేసిన 315 పర్మినెంట్ కార్మికులకు కర్ణాటక కోర్టు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 యాక్ట్ పై ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాజివిటీ, జీతాల బకాయి, పిఎఫ్ రూ.9 కోట్లను వెంటనే చెల్లించి మిల్లులోని యంత్రాలు, ఇతర పరికరాలను యాక్షన్ ద్వారా అమ్ముకోవాలన్నారు. అలా కాకుండా బకాయిలు చెల్లించ కుండానే యాక్షన్ వేసి అమ్ముకోవడానికి యాజమాన్యం కార్మికులను మోసం చేయాలని చూస్తే అడ్డు కుంటామని వారు హెచ్చరించారు.మీడియాతో మాట్లాడుతున్న మదనపల్లి స్పిన్నింగ్ మిల్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జేవి నరసింహమూర్తి, రెడ్డెప్పరెడ్డి.

 

Tags: Pay the dues of the mill workers and do the auction.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *