సకాలంలో పనులు చెల్లించి వడ్డీ రాయితీ పొందండి
నందికొట్కూరు ముచ్చట్లు:
నందికొట్కూరు పురపాలక సంఘం పరిధిలోని ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ పి కిషోర్ అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 34 ఉత్తర్వుల మేరకు ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను చెల్లింపు దారులు చెల్లించవలసిన పన్ను బకాయిలను ఏక మొత్తంగా2022,23 రెండవ ఆర్థిక సంవత్సరం వరకు పూర్తిగా చెల్లించాలన్నారు. ఆ విధంగా చెల్లించినచో వడ్డీ లేకుండా చెల్లించుటకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఈ అవకాశం కేవలం ఈనెల 31 వరకు మాత్రమే ఉంటుందన్నారు. కాబట్టి నందికొట్కూరు పట్టణ ప్రజలు ఈ అవకాశం ను సద్వినియోగం పరుచుకోవాలని ఆయన సూచించారు.
Tags;Pay the works on time and get interest concession

