Natyam ad

అవధానం చేయాలంటే సమయస్ఫూర్తి కావాలి

కడప  ముచ్చట్లు:


అవధానం చేయాలంటే సమయస్ఫూర్తి కావాలని  అధ్యక్షులు, ఆం.ప్ర. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి అధ్యక్షులు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి అన్నారు.గత ఆదివారం కడప పట్టణ శివారులోని శ్రీలలితపంచాయతన దేవాలయంలో డా. నరాల రామారెడ్డి స్వర్ణ గండపెండేర సత్కార సభ నిర్వహించబడింది కార్యక్రమంలో ముందుగా వేదికపైన ఉన్న అతిథులు, కార్యక్రమ నిర్వాహకులతో కలిసి జస్టిస్‌ సి.వి. నాగార్జున రెడ్డి నరాల రామారెడ్డిని స్వర్ణ గండపెండేరంతో సత్కరించారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్‌ సి.వి. నాగార్జున రెడ్డి మాట్లాడుతూ సరస్వతీ సమానులైన రామారెడ్డికి గండపెండేరాన్ని తొడగడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. అవధానం చేయాలంటే సమయస్ఫూర్తి, ధారణ, పురాణేతిహాసాలపై పట్టు, పాండిత్యం కలిగి ఉండాలన్నారు ఈ లక్షణాలన్నీ పరిపూర్ణంగా  కవి నరాల రామారెడ్డికి ఉన్నాయన్నారు. నరాల  విశిష్టతను తన చిన్ననాటినుండే వింటున్నానని అటువంటి వ్యక్తిని తన చేతులమీదుగా సత్కరించుకోవడం హర్షణీయమని అన్నారు. సభాధ్యక్షులు  ఆంధ్రప్రదేశ్‌ రెడ్డి జనసంఘ్ రాష్ట్ర అధ్యక్షులు లెక్కల కొండారెడ్డి కార్యక్రమ నివేదిక తోపాటు సత్కార గ్రహీత రామారెడ్డిని సభకు పరిచయం చేశారు. అనంతరం  రామారెడ్డి విశిష్టతను కొనియాడుతూ ప్రచురించిన అవధాన స్వర్ణోత్సవ సంచిక ‘స్వర్ణమంజరి’ని, రామారెడ్డి రచించిన కర్ణభారతం, అవధానసౌరభం పుస్తకాలను జస్టిస్‌ సి.వి. నాగార్జున రెడ్డి, మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామిరెడ్డి అతిథులతో కలిసి ఆవిష్కరించారు.  విశిష్ట అతిథి, చిన్మయ మిషన్‌ అధ్యక్షులు స్వామి తురీయానంద సరస్వతి మాట్లాడుతూ  రామారెడ్డి వంటి గొప్ప కవులను గండపెండేర సత్కారంతో గౌరవించడం తెలుగు తల్లిని గౌరవించడం లాంటిదని,

 

 

ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతను సాహిత్యంవైపుకు మళ్ళించే టందుకు తోడ్పాటును అందిస్తాయన్నారు  మరో విశిష్ట అతిథి మైదుకూరు నియోజకం వర్గం శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు ప్రాంతం గడియారం వేంకటశేషశాస్త్రి, దుర్భాక రాజశేఖర శతావధాని, పుట్టపర్తి నారాయణాచార్యులు, సి.వి.సుబ్బన్న శతావధాని, రాజన్నకవి వంటి  ఎంతోమంది కవులకు పుట్టినిల్లని, ఈ కోవలోనే నరాల రామారెడ్డి ఆ గడ్డపై పుట్టడం ఆ నేలకే గర్వకారణమన్నారు మరో విశిష్ట అతిథి,  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పారిశ్రామిక సలహాదారులు రాజోలి వీరారెడ్డి మాట్లాడుతూ రామారెడ్డి తన అవధానాలతో  కడప జిల్లా కీర్తిని ఖండాంతరాలకు విస్తరింపజేశారని అన్నారు
. మరో విశిష్ట అతిథి, శతావధాని ఆముదాల మురళి మాట్లాడుతూ గండపెండేరంతో సత్కరించే సంప్రదాయం శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి వస్తూ వుందన్నారు. మరోవిశిష్ట అతిథి, విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు డా. కరిమద్దెల పనరసింహారెడ్డి మాట్లాడుతూ నరాల రామారెడ్డి వంటి గొప్ప అవధాన కవి  తనకు  గురువుగా దక్కడం అదృష్టమన్నారు
మరో విశిష్ట అతిథి, అష్టావధాని కోట రాజశేఖర్‌ మాట్లాడుతూ నరాల రామారెడ్డి అవధానాల్లో ధారణతో పాటు కవిత్వపు మల్లెల సుగంధం పరిమళిస్తూ వుంటుందని అభిప్రాయపడ్డారు.

 

 

 

Post Midle

ప్రత్యేక ఆహ్వానితులుగా ఆంధ్రప్రదేశ్‌ రెడ్డి జనసంఘ్  కడప జిల్లా శాఖ కార్యదర్శి ముమ్మడి శ్రీధర రెడ్డి, జిల్లా శాఖ అధ్యక్షులు మద్దిక సుబ్బిరెడ్డి, ఆర్‌.బి.వి.ఆర్‌. హాస్టల్‌, అబిడ్స్‌, హైదరాబాదు అధ్యక్షులు కె.లక్ష్మీకాంత్‌ రెడ్డి, అఖిల భారత రెడ్ల సంక్షేమ సంఘం, శ్రీశైలం ప్రధాన కార్యదర్శి జి.తాతిరెడ్డి, కోశాధికారి గుడ్ల ఆదినారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు యస్‌.వి.రమణారెడ్డి, కర్నూలు జిల్లా శాఖ అధ్యక్షులు ఐ.విజయ్‌ కుమార్‌ రెడ్డి,  బి.జయరామిరెడ్డి, నిర్వహణ కార్యదర్శి వి. గంగిరెడ్డి, శాఖ అధ్యక్షులు డా యం.సుబ్బిరెడ్డి,, అనంతపురం జిల్లా శాఖ అధ్యక్షులు కె.శ్రీనివాస రెడ్డి,  కార్యదర్శి ఎం.శ్రీధరరెడ్డి,, చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు జి.ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, నెల్లూరు ఎస్‌.నరసింహారెడ్డి అవధాన కవి డా. నరాల రామారెడ్డిని అభినందించారు. నరాల రామారెడ్డి తన స్పందనను తెలియజేస్తూ నేడు ఇక్కడ నిర్వహించిన స్వర్ణ గండపెండేర సత్కార కార్యక్రమం తన జీవితంలో మరుపురాని తీపి జ్ఞాపకంగా నిలిచిపోతుందని కార్యక్రమా నంతరం అతిథులను, ‘స్వర్ణమంజరి’ సంచిక సంపాదకులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. యోగి వేమన విశ్వవిద్యాలయం లలితకళల విభాగం సహ ఆచార్యులు డా.మూల మల్లికార్జున రెడ్డి సభాసమన్వయం చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, సాహితీప్రియులు, కడప పురప్రముఖులు, రామారెడ్డి అభిమానులు పాల్గొన్నారు.

 

Tags: Paying attention requires timing

Post Midle