చంద్రబాబు దయవల్లే రేవంత్ కు పీసీసీ

న్యూఢిల్లీ  ముచ్చట్లు :

ఎట్టకేలకు తెలంగాణ పీసీసీ పదవిపై ఉత్కంఠ వీడిపోయింది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా అధిష్టానం ఖరారు చేసింది. టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ చీఫ్ పదవి కట్టబెట్టడంపై అక్కడి సీనియర్లు మండిపడుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి సీనియర్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అయితే పీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకంపై వైసీపీ కీలక నేత, రాజ్యసభ్య సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డికి పదవి ఎలా వచ్చిందో విజయసాయి తేల్చేశారు. పొలిటికల్ బ్రోకర్ చంద్రబాబు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడని.. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలని కొనిపడేసి తెలంగాణలో తన శిష్యుడికి పీసీసీ అధ్యక్ష పీఠం ఇప్పించుకున్నారని విజయసాయి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని భ్రష్టుపట్టించాడని.. ఇప్పుడు పార్టీని డైరెక్టుగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడని ఎంపీ అన్నారు.అటు బీజేపీలోకి కూడా తన మనుషులను పంపించాడని విజయసాయి ఆరోపించారు. కేసుల నుంచి రక్షణ కోసం నలుగురు ఎంపీలకు బీజేపీ తీర్థం ఇప్పించాడని ఆయన అన్నారు. ‘మనవాళ్లు బ్రీఫుడ్ మీ’ కేసు ఎప్పటికీ తేలకుండా తెలంగాణా పార్టీ అధ్యక్షుడిని గులాబి పార్టీలోకి చొప్పించాడని విజయసాయి అన్నారు. పచ్చ రక్తం నరనరాల్లో ప్రవహించే కరడు కట్టిన ముఖ్యులను ముందుగానే కాంగ్రెస్‌లోకి తోలాడు. బాబా మజాకా! అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:PCC to Chandrababu Dayavalle Rewanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *