వ్యభిచార గృహాల నిర్వహకులపై  పీడీ యాక్ట్ 

Date:13/07/2018
యాదాద్రి ముచ్చట్లు:
యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి క్షేత్రానికి నిలయమైన యాదగిరిగుట్టలో వ్యభిచార వృత్తి నిర్మూలనకు రాచకొండ కమిషనరేట్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అసాంఘీక కార్యకలాపాల సంఘటనలకు పాల్పడే ప్రైవేట్ లాడ్జీ యజమానులపై కేసులతో పాటు సీజ్ చేస్తున్న పోలీసులు తాజాగా  వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న నిర్వహికుల వారిపై ప్రివెంటెడ్ డిటెక్షన్(పీడీ) యాక్ట్ ప్రయోగిస్తున్నారు. ఈ మేరకు యాదగిరిగుట్ట పట్టణంలోని గణేష్ నగర్ ప్రాంతంలో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న నలుగురు మహిళలపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నలుగురు ఒక ముఠాగా ఏర్పడి వ్యభిచారమే వృత్తిగా చేసుకుని పట్టణంలోని గణేష్ నగర్లోని వ్యభిచార గృహాల్లో కొంతమంది తమ సామాజిక వర్గం వారితో పాటు ఇతర ప్రాంతాల యువతులను మాయమాటలతో నమ్మించి వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. యువతులకు విలాసవంతమైన జీవితం కల్పిస్తామని ఈ రొంపిలోకి లాగుతుంటారు. వీరు విటులను ఆకర్శించి పెద్దఎత్తున వారి నుంచి నగదును వసూలు చేసి, బాధిత యువతులకు కొంత ఇస్తుంటారు. ఎంతోమంది యువతుల ఉజ్వల భవిష్యత్ చీకటిగా మారుస్తుంటడంతో పోలీసులు వ్యభిచార వృత్తి నిర్వహణ నుంచి మానుకోవాలని అవగాహన తరగతులు నిర్వహించారు. అయినప్పటికి వీరు తమ వైఖరి మార్చుకోకుండా అదే వృత్తిని కొనసాగిస్తుండటంతో ఈ నెల 3న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఈ గృహాల నుంచి నలుగురు బాధిత యువతులను రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు. నలుగురు వ్యభిచార గృహాల నిర్వాహకులపై కేసు నమోదు చేసి నల్లగొండ జైలుకు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ వ్యభిచార గృహాలు, వీటి నిర్వాహకుల కారణంగా పవిత్ర పుణ్యక్షేత్రంలో అసాంఘీక కార్యకలపాలు సాగడమే గాక ఆ ప్రాంతంలోని పరిసరాల కుటుంబాలు ఇబ్బందులకు గువుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. వ్యభిచార వృత్తిని నిర్మూలించడానికి నిర్వాహకులపై కఠినంగా వ్యవహరించడానికి నలుగురు వ్యభిచార గృహాల నిర్వహకులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ పోలీస్ కమిషన్ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు.
వ్యభిచార గృహాల నిర్వహకులపై  పీడీ యాక్ట్https://www.telugumuchatlu.com/pdidi-act-on-adolescent-halls/
Tags; Pdidi Act on Adolescent Halls

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *