Natyam ad

వైఎస్ఆర్ సిపితోనే పట్టణంలో శాంతి, అభివృద్ధి.

ప్రతి గ్రామానికి వెలిగల్లు నీటిని అందించి తీరుతా…

ఏడాదిలోగా పట్టణంలో ప్రతి రోజూ త్రాగునీరు సరఫరా అయ్యేలా కృషి…

ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అనునిత్యం పాటుపడుతున్నా…

Post Midle

మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.

 

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి పట్టణం, నియోజకవర్గ అభివృద్ధి, శాంతి వైఎస్ఆర్సిపి తోనే సాధ్యమని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం రాయచోటి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బండ్ల పెంటలోని మదరసాలు ప్రత్యేక పూజలు అనంతరం మండలి డిప్యూటీ చైర్మన్ జకియా కానం, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాషలతో కలిసి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో రాయచోటి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మార్చడంతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేశామన్నారు. రాయచోటి పట్టణానికి శాశ్వత తాగునీటిని అందించేలా ప్రత్యేక ప్రణాళికలను రూపొందించామన్నారు. ఈ క్రమంలోనే రెండేళ్లలో రూ 100 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణపు పనులును పూర్తి చేయిస్తామన్నారు. రూ 190 కోట్ల నిధులతో పి జి కేంద్రం, ఆపై యూనివర్శిటీ గా అభువృద్ది పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ప్రతి గ్రామానికి వెలిగల్లు నీటిని అందించి తీరుతామన్నారు. వెలిగల్లు అదనపు నీటి పథకం ద్వారా ఏడాది లోగా పట్టణంలో ప్రతి రోజూ త్రాగునీరు సరఫరా అయ్యేలా కృషి చేస్తున్నామన్నారు.పట్టణ పేదల కోసం 6 వేల ఇళ్లతో నిర్మితమవుచున్న నారాయణరెడ్డిగారి పల్లె జగనన్న కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించి ఆదర్శ కాలనిగా తీర్చిదిద్దుతామన్నారు.

 

 

అభివృద్దే తమ విధానమన్నారు. అన్ని వర్గాలకు సీఎం జగన్ మేలు చేసినందునే 175 స్థానాలలో ఒంటరిగా పోటీ చేస్తున్నారన్నారు. అభివృద్ధి సంక్షేమంలో తండ్రికి మించిన తనయుడిగా జగన్ పేరొందారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , బిజెపి లు ఏకమైన, ప్రజలు అండదండలు జగనన్నకు వుండేంతవరకు ఎవ్వరూ ఏమి చేయలేరన్నారు. తాను ఏమైతే చేయగలుగుతానో అదే జగన్ చెబుతున్నారన్నారు. ఇదే జగన్ నిజాయితీకి నిదర్శనమన్నారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన మేలును ప్రతి ఒక్కరూ గుర్తించి ఫ్యాను గుర్తుకు ఓట్లు వేయాలని, ఎంఎల్ఏ అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా మిథున్ రెడ్డి లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు.

 

జగన్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ లబ్ది: శాసన మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ జకీయా ఖానం జగన్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ లబ్ది జరిగిందని శాసన మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ జకీయా ఖానం పేర్కొన్నారు. ప్రజా రంజకంగా జగన్ పాలన సాగిందన్నారు. మరో మారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆదరించి, ఆశీర్వదించాలని కోరారు.
అంతకుముందుగా దర్గాలో వందలాదిగా తరలివచ్చిన మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

Tags: Peace and development in the town only with YSRCP.

Post Midle