తిరుపతిలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
తిరుపతి ముచ్చట్లు
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి . ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది . గూడూరు పట్టణ పరిధిలో SKR ప్రభుత్వ జూనియర్ కళాశాల , స్వర్ణాంధ్ర భారతి కళాశాల , సెయింట్ మేరీస్ కళాశాల , డి ఆర్ డబ్ల్యు కళాశాల , నారాయణ కళాశాల మొత్తం ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు . గూడూరు పట్టణం మరియు మండల పరిధిలోని 1468 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు . పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు . పరీక్షలు ప్రశాంతంగా జరిగినందుకు అవసరమైన బందోబస్తును పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది .

Tags ;
Peaceful Inter Exams in Tirupati
