పుంగనూరులో రైతులందరికి వేరుశెనగ విత్తనాలు -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని రైతులందరికి వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేస్తామని, ఎవరు నిరుస్సాహపడవద్దని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఏతూరు గ్రామంలో పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి తో కలసి వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీపీ మాట్లాడుతూ మండలానికి 1795 క్వింటాళ్ళ వేరుశెనగ విత్తనాలు సరఫరా అయిందన్నారు. 22 ఆర్‌బికెలలో నమోదు, పంపిణీ కార్యక్రమం పటిష్టంగా నిర్వహిస్తున్నామన్నారు. అవసరమైన మేరకు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతో విత్తనాల సరఫరా చేయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో సంధ్య, వైఎస్సార్‌సీపీ నాయకులు కొత్తపల్లె చెంగారెడ్డి, సుధాకర్‌రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌ , ప్రశాంత్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Peanut seeds for all farmers in Punganur – MPP Bhaskar Reddy

Post Midle
Natyam ad