Natyam ad

అంగన్‌వాడీల్లో మహిళల ఆరోగ్యానికి పెద్దపీఠ- సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

రామసముద్రం ముచ్చట్లు:
 
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గర్భవతులకు, పిల్లల ఆరోగ్యానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చిందని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక పంచాయతీ పరిధిలోని గుంతయంబాడి గ్రామంలోనున్న అంగన్‌వాడీ కేంద్రంలో గర్భవతులకు, బాలింతలకు పౌష్ఠికహారాన్ని ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో విద్యకు, ఆరోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అలాగే మదనపల్లి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు నవాజ్ బాషా ఆదేశాల మేరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భవతులు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తున్నట్లు తెలిపారు. మహిళల ఆరోగ్యం కోసం వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అంగన్‌ వాడీ కేంద్రాలకు ఎంతో ప్రాముఖ్యత కల్పించిందన్నారు. మెను నిర్ణయించి, పిల్లలకు పోషక పదార్థాలను ఇవ్వడం జరుగుతోందన్నారు. అలాగే ప్రణాళిక బద్దంగా పిల్లలకు బోదనను నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను పీప్రైమరీ స్కూళ్లుగా ఏర్పాటు చేసి , నాణ్యమైన విద్య, భోజనం అందించడం జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి ఉపాధ్యాయురాలు రాధమ్మ, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, జయచంద్ర, రెడ్డెప్పరెడ్డి, నాగరాజ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Tags: Peddapeetha- Sarpanch Srinivasureddy for Women’s Health in Anganwadi

Leave A Reply

Your email address will not be published.