విత్తనపు పొటేళ్ల ప్రదర్శన ప్రారంభించిన పెద్దిరెడ్డి

Peddi Reddy, who opened the Seed Scape

Peddi Reddy, who opened the Seed Scape

Date:19/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని బిఎంఎస్‌క్లబ్‌లో మంగళవారం విత్తనపు పొటేళ్ల ప్రదర్శనను పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మదనపల్లె ఏడిలు మనోహర్‌, రమేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్యఅతిధులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అక్కిసాని భాస్కర్‌రెడ్డి, కొండవీటి నాగభూషణం, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, మాజీ ఎంపీపీ నరసింహులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో 76 విత్తనపు పొటేళ్లు పోటీ పడ్డాయి. 150 మంది గొర్రెల కాపరులు పాల్గొన్నారు. వెహోదటి బహుమతి నారాయణప్ప పెద్దపంజాణి, రెండవ బహుమతి బాలయ్య పెద్దపంజాణి, లక్ష్మన్న చౌడేపల్లె మండలాల వారికి లభించింది. ఈ ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ కోఆప్షన్‌ మెంబర్‌ ఖాదర్‌బాషా, వెటర్నరీ డాక్టర్లు వెంకటమునినాయుడు, దినేష్‌, ధనుంజయన్‌, సరిత, సునిత, కృష్ణకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు 

Tags: Peddi Reddy, who opened the Seed Scape

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *