మంత్రి హోదా లో పెద్దిరెడ్డి తొలిసారి పల్లెబాట

Minister Peddi Reddy's touring villages on 2

Minister Peddi Reddy's touring villages on 2

-నియోజకవర్గంలో ఏటా రెండుసార్లు

Date:01/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర పంచాయతీరాజ్‌ ,గ్రామీణాభివృద్ధి గనులశాఖ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి  హోదా లో తొలిసారిగా సొంత నియోజకవర్గమైన పుంగనూరులో శుక్రవారం నుంచి పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు సిద్దం చేశారు. జిల్లా రాజకీయాలలో విలక్షణ నేత. ఏ నేతకు లేని గుర్తింపు దక్కించుకొన్న ఆయనకు జనమే శ్వాస. ఇన్‌స్టంట్‌ రాజకీయాలకు భిన్నంగా మంత్రి పెద్దిరెడ్డి ఏటా రెండుసార్లు ప్రజలతో నేరుగా కలిసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజలే జీవితంగా గుర్తింపు పొందిన ప్రజానేత పెద్దిరెడ్డిని ప్రతి ఒక్కరు ( పెద్దాయనగా) పిలుస్తారు.

×ఏటా జనం మధ్యేనే…..

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు మండలం సింగిరిగుంటలో ఉదయంలో 7 గంటలకు పల్లెబాట ప్రారంభిస్తారు. ఈ విధంగా ఆయన రాత్రి వరకు 17 గ్రామాల్లో పర్యటన చేస్తారు. తిరిగి శనివారం పుంగనూరు మండలంలో పర్యటిస్తారు. ఇలా విశ్రాంతి లేకుండ నిత్యం జనంలో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పల్లెబాట చేపట్టారు. పుంగనూరు నియోజకవర్గంలో మున్సిపాలిటితో పాటు ఆరు మండలాలు ఉన్నాయి. అవి పుంగనూరు మున్సిపాలిటిలో 24 వార్డులు ఉన్నాయి. అలాగే పుంగనూరు , చౌడేపల్లె, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలు కలవు . వీటిలో 106 పంచాయతీలు, 876 గ్రామాలు ఉన్నాయి. అయ్యప్పమాల ధరించి తన పల్లెబాటను సంవత్సరంలో తొలిసారిగా ప్రారంభిస్తారు. ఈ విధంగా ఏడాది రెండుసార్లు పల్లెబాట పేరుతో ప్రతిపల్లెకు వెళ్లి జనంతో మమేకమవుతారు. ఒక్కో పల్లెకు రెండుసార్లు వెళతారు. అన్నిశాఖల అధికారులను వెంట పెట్టుకుని పర్యటించి, ప్రజల సమస్యలపై అక్కడిక్కడే స్పందించి, పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు.

×అయ్యప్పంటే ఎనలేని భక్తి…

ఏడాదంతా ప్రజల్లో ఏలా కలిసివుంటారో భక్తి విషయంలోనూ అంతే. అయ్యప్పస్వామి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అచంచలమైన భక్తి విశ్వాసాలు. తన స్వగ్రామమైన సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేసి, అత్యంత సుందరంగా శ్రీ అయ్యప్పస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో నిత్య పూజలు, అన్నదానాలు కొనసాగిస్తున్నారు. ప్రతి యేటా రెండుసార్లు అయ్యప్పమాల ధరిస్తారు. కఠోరదీక్షతో మాలధారణ ఉంటూ అదే సమయంలో పల్లెబాట నిర్వహిస్తారు. కాలికి చెప్పులు లేకుండా పల్లెల్లో కిలోమీటర్ల దూరం నడుస్తారు.

ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర

Tags: Peddi Reddy’s first appearance in ministerial status

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *