పుంగనూరులో పెద్దిరెడ్డి హ్యాట్రిక్‌

Peddireddy hat trick in Punganuru

Peddireddy hat trick in Punganuru

Date:25/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మూడు సార్లు ఎన్నికై హ్యాట్రిక్‌ సాధించారు. ఆయన తొలుత 1974లో ఎస్వీ యునివర్శిటిలో విద్యార్థి అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. 1978లో మాజీ రాష్ట్రపతి నీలంసంజీవరెడ్డి ప్రోత్సాహంతో పీలేరు ఎమ్మెల్యేగా తొలిసారిగా పోటీ పడ్డారు. 1989లో చల్లా ప్రభాకర్‌రెడ్డిపై పోటీ పడి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో జివి.శ్రీనాథరెడ్డిపై గెలుపొందారు. తిరిగి 2004లో గెలుపొందారు. 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు డీసీసీ అధ్యక్షుడుగా పని చేశారు. 2008లో పీసీసీ ఉపాధ్యక్షుడుగా నియమింపబడ్డారు. 2009లో పుంగనూరు ఎమ్మెల్యేగా విజయం సాధించి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో అటవీశాఖ మంత్రిగా పని చేశారు. తిరిగి 2014 ఎన్నికల్లో ఎన్నికైయ్యారు. ఈ సారి ఎన్నికల్లోను మూడవసారి ఎన్నికైయ్యారు.

 

జగన్  విజయం  వెనుక దివ్యారెడ్డి

 

Tags: Peddireddy hat trick in Punganuru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *