Peddireddy inspects development work in Boyakonda

బోయకొండలో అభివృద్దిపనులను పరిశీలించిన పెద్దిరెడ్డి

– అమ్మవారికి ప్రత్యేకపూజలు
-పనులు త్వరగా పూర్తిచేయాలని సూచన

Date:21/10/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

జిల్లాలో నాల్గవపుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద కోట్లాది రూపాయల న్యిధులతో జరుగుతున్న అభివృద్దిపనులను బుధవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పరిశీలించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి బోయకొండపై మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక నిధులను మంజూరుచేయించి, పలు అభివృద్దిపనులు, మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకొన్న విషయం తెలిసిందే. ఈ పనులను పెద్దిరెడ్డి పరిశీలించి అధికారులకు, కాంట్రాక్టర్‌లకు సూచనలు చేశారు. పనులు నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆలయం వద్దకు బండ్లపై ఆర్చి వరకు చేపడుతున్న రోడ్డుపనులను శరవేగంగా జరుగుతున్నాయని అభినందించారు.కొండపై యాత్రికుల కు సౌకర్యంగా రూ:36 లక్షల వ్యయంతో జరుగుతున్న మరుగుదొడ్లునిర్మాపనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కొండపై ఉపాధిహామీ నిధులతో విలేజ్‌ పార్క్ను సైతం ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరంణల మద్య గడిపేలాప్రణాళిక బద్దంగా పనులు చేపట్టాలనిసూచించారు. వాహనాల పార్కింగ్‌ స్థలంను పరిశీలించారు. దసరామహ్గత్సవాల్లో భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు.అనంతరం అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. కరోనా బారీనుంచి రాష్ట్రప్రజలను రక్షించాలని కోరారు. అనంతరం ఈఓ చంద్రమౌళి పవిత్ర ప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట ఏఐపీపీ మెంబరు అంజిబాబు, ఎంపీడీఓ వెంకటరత్నం, మంత్రి పిఏ చంద్రహాస్‌ నేతలు లడ్డూరమణ,బెల్లం వెంకట రమణారెడ్డి,రమేష్‌రెడ్డి,పురుషోత్తంరెడ్డి,శంకరప్ప,నవీన్‌కుమార్‌రెడ్డి, రవిరెడ్డి కళ్యాణ్‌ ,చిన్నప్ప,రమేష్‌,గిరిబాబు,తదితరులు పాల్గొన్నారు.

సరస్వతీదేవి గా బోయకొండ గంగమ్మ

Tags: Peddireddy inspects development work in Boyakonda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *