Natyam ad

నాల్గవసారి ఎమ్మెల్యే పదవికి పోటీలో పెద్దిరెడ్డి

– రైతు కుటుంబం నుంచి రాజకీయ వేత్తగా
– నేర చరిత్ర లేని పెద్దిరెడ్డి

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

సాధారణ రైతు కుటుంబంలో జన్మించి , వ్యవసాయమే ఆధారంగా జీవిస్తూ అంచలంచలుగా రాజకీయాల్లో ఎదిగి, ఎలాంటి నేర చరిత్ర లేకుండ డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం నామినేషన్‌ను దాఖలు చేశారు. ఇప్పటికే పుంగనూరు ఎమ్మెల్యేగా 2004లో నియోజకవర్గాల విభజనలో పుంగనూరు ఇన్‌చార్జ్గా పెద్దిరెడ్డి ఆరంగ్రేటమ్‌ చేశారు. 2009, 2014, 2019 లో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ సాధించిన పెద్దిరెడ్డి నాల్గవ సారి ఎన్నికల బరిలో యుద్ధానికి సిద్ధం అంటు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో తన భూములు, నగలు, ఇండ్లు, వ్యాపార లావాదేవిలకు సంబంధించి పెట్టుబడులు, అప్పులతో కలిపి అఫిడవిట్‌లో పూర్తి వివరాలు పొందుపరిచారు. ఆయన ఖాతాల్లో అన్ని బ్యాంకుల్లోను రూ.38,33,988 లు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిని ఎన్నికల అధికారి విడుదల చేశారు.

 

Tags: Peddireddy is contesting for the post of MLA for the fourth time

Post Midle