పుంగనూరు మున్సిపాలిటిలో గడప గడపకు మన ప్రభుత్వం జయప్రదం చేయాలి- పెద్దిరెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలో శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న గడప గడపకు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం మున్సిపాలిటిలో కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దిరెడ్డి, రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ హాజరైయ్యారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు కార్యక్రమాన్ని పట్టణంలోని 5, 13, 14, 15, 16 వార్డులలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు వార్డు కౌన్సిలర్లు, అధికారులు , ప్రజాప్రతినిధులు , పార్టీ నేతలు , పెద్దిరెడ్డి అభిమానులు తప్పక హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ లలిత, కౌన్సిలర్లు పూలత్యాగరాజు, అమ్ము, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Tags: Peddireddy, our government should make Jayapradam to stop Gadapa Gadapa in Punganur Municipality
