Natyam ad

పుంగనూరు నిత్యజాతీయగీతాలాపనలో భాగస్వామ్యులుకండి – పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

దేశభక్తిని పెంపొందించేందుకు పట్టణంలో ఏర్పాటు చేసిన నిత్యజాతీయగీతాలాపనలో ప్రతి ఒక్కరు భాగస్వాములై జయప్రదం చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి కోరారు. ఆదివారం పట్టణంలో జరిగిన జనగణమన గీతాలాపన కార్యక్రమంలో రాష్ట్రజానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డితో కలసి పాల్గొన్నారు. జనగణమన పాడి వందన సమర్పణ చేశారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పంగనూరులో జనగణమన గీతాన్ని ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ఆలాపించడం 2018లో ప్రారంభించారని అభినందించారు. నాలుగేళ్ళుగా నిరంతరాయంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆదర్శమన్నారు. ఇలాంటి దేశభక్తి కార్యక్రమాల ద్వారా ప్రజలు క్రమశిక్షణతో జీవించేందుకు వీలుందన్నారు. ఆగస్టు 15 వేడుకల్లో ప్రతి ఒక్కరు ఇంటిపై జెండా కట్టి దేశభక్తిని చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, కౌన్సిలర్‌ అమ్ము, వైఎస్సార్‌సీపీ నాయకులు రాజేష్‌, సురేష్‌, భానుప్రసాద్‌, శ్రీనివాసులు, ఇర్ఫాన్‌, ఎస్‌ఐ మోహన్‌కుమార్‌, జనగణమన కమిటి సభ్యులు అయూబ్‌, వెంకటేష్‌, దీపక్‌, రెడ్డివినయ్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Peddireddy – Peddi Reddy

Post Midle