పీలేరు లో రాష్ట్ర విద్యుత్ అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన
పీలేరు ముచ్చట్లు:
నియోజకవర్గం లో అనేక ఆర్ఓ ప్లాంటులు, భవనాలు ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.కార్యక్రమంలో పాల్గొన్న పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపి ఎన్. రెడ్డప్ప, టిటిడి పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ తదితరులు.అనంతరం పీలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న మంత్రి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…..
పీలేరు ప్రజలను కలిసి చాలా రోజులైంది… మీతో మాట్లాడాలని ఈ సమావేశం ఏర్పాటు చేశాం.30 సంవత్సరాలు నుండి పీలేరు ప్రజలకు నాతో అనుభందం ఉంది.2014 ఎన్నికల్లో వైసిపి మానిఫెస్టో కమిటీలో నేను సభ్యుడిని.రుణమాఫీ హామీ ఇవ్వకపోతే ఒడిపోతాం అని వైఎస్ జగన్ కు చెప్పాం.చేయలేనిది చేస్తానని చెప్పి ప్రజలకు మాట తప్పలేను అని ఆరోజు జగన్ చెప్పారు.రుణమాఫీ చేస్తాను అని చెప్పి రైతులను, మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు.కరోనా కారణంగా రాష్ట్రం ఆర్థికంగా నష్ట పోయినా, సిఎం వైఎస్ జగన్ ఎక్కడా ఎన్నికల హామీలు పక్కన పెట్టలేదు.ఎన్నికలు జరిగిన మూడు ఏళ్లలో 98.44 శాతం హామీలు నెరవేర్చిన ఘనత సిఎం వైఎస్ జగన్ ది.ఈరోజు జగన్ అన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా ప్రజలు అనూహ్య స్పందన చూపించారు.1.45 కోట్ల ఇళ్లకు ఇప్పటికే వైసిపి సైనికులు చేరుకుని వారి అభిప్రాయాలను సేకరించారు.టిడిపి అధికారంలోకి రాలేదు అని చంద్రబాబుకి కూడా తెలుసు… పైకి దైర్యం చూపుతున్నారు.పెండింగ్ బిల్లులు అన్ని అతి త్వరలో ప్రభుత్వం చెల్లిస్తుంది.
కరోనా కారణంగా ప్రభుత్వం రెండు సంవత్సారాలు పాటు ఆదాయం కోల్పోయింది.ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు వివిధ పథకాలు ద్వారా లబ్దిదారుల బ్యాంక్ ఖాతా లో చెల్లించాం.పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరు, మదనపల్లి కి 2400 కోట్ల రూపాయలతో పైప్ లైన్ ద్వారా నీరు అందిస్తున్నారు.ప్రస్తుతం రెండు రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుంది… త్వరలో మనకు తాగు సాగు నీరు కు ఎటువంటి ఇబ్బందీ ఉండదు.ఈరోజు కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా కేవలం పేదరికం ఆధారంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారు.గతంలో జన్మభూమి కమిటీలు వారి బంధువులకు, కావాల్సిన వారికి ఇచ్చే వారు.చంద్రబాబు కు జగన్ కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.ప్రజలందరూ సిఎం వైఎస్ జగన్ కు అండగా నిలవాలి.పీలేరు లో మరో సారి చింతల రామచంద్రారెడ్డి ని గెలిపించాలి.
Tags: Peddireddy Ramachandra Reddy, State Minister of Electricity Forests and Underground Mines visited Peeleru
