Natyam ad

పులిచర్ల మండలం లో పల్లెబాట కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పులిచర్ల ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం లో పల్లెబాట కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.మొదటి రోజు పర్యటన లో బాగంగా మంగళవారం నాడు మండలం లోని మతుకువారిపల్లి, పాతపేట, చల్లావారిపల్లి, బొడిరెడ్డిగారిపల్లి, వెంకటదాసరపల్లి, అయ్యావాండ్లపల్లి, రాజులపల్లి, దిగువపొకలవారిపల్లి పంచాయతీల పరిధిలోని 47 పల్లెల్లో పర్యటించిన మంత్రి.ఇప్పటికే నియోజకవర్గం లోని పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం మండలాల్లో పల్లెబాట కార్యక్రమం పూర్తి చేసిన మంత్రిమొత్తం 18 రోజుల పాటు 644 పల్లెలు పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Post Midle

పల్లెబాట లో బాగంగా కొనసాగుతున్న పార్టీలోకి చేరికలు

మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో పల్లెలు అన్ని సుభిక్షంగా ఉన్నాయి.గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేశారు.దేశం లో నిజమైన గ్రామ స్వరాజ్యం తెచ్చిన ముఖ్యమంత్రి  వైఎస్ జగన్.ఉమ్మడి ఆంధ్రపదేశ్ చరిత్ర లో ఎవ్వరూ పథకాలు ఇంత పారదర్శకంగా అందించలేదు.నేరుగా ఖాతాల్లో కి నిధులు జమ చేసి మధ్యవర్తులు లేకుండా చేశారు.మంచి నిర్ణయాలు తీసుకుని అద్భుతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి   వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలిచి, మరో సారి భారీ విజయాన్ని అందించాలి.నియోజకవర్గం లో అన్ని సమస్యల పరిష్కారం కు కృషి చేస్తున్నాం.గతంలో అనేక కారణాలు వలన పూర్తి స్థాయి అబివృద్దికి నియోజకవర్గం నోచుకోలేదు.ఆ అభివృద్ధి మొత్తాన్ని మూడేళ్లలో సిఎం   వైఎస్ జగన్ సహకారం తో చేసుకున్నాం.ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు.

 

 

గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశాక గతంలో లాగా పెద్దగా ఫిర్యాదులు అందట్లేదు.దృష్టికి వచ్చిన అన్ని చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తున్నాం.పుంగనూరు: సిఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో పల్లెలు అన్ని సుభిక్షంగా ఉన్నాయన్నారు రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మంగళవారం నాడు పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం లో పల్లెబాట కార్యక్రమం చేపట్టారు మంత్రి. మండలంలో మొదటి రోజు పర్యటన లో బాగంగా మంగళవారంనాడు మతుకువారిపల్లి, పాతపేట, చల్లావారిపల్లి, బొడిరెడ్డిగారిపల్లి, వెంకటదాసరపల్లి, అయ్యావాండ్లపల్లి, రాజులపల్లి, దిగువపొకలవారిపల్లి పంచాయతీల పరిధిలోని 47 పల్లెల్లో పర్యటించారు మంత్రి. ఇప్పటికే నియోజకవర్గం లోని పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం మండలాల్లో పల్లెబాట కార్యక్రమం పూర్తి చేసిన మంత్రి, మొత్తం 18 రోజుల పాటు 644 పల్లెలు పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించారు.

 

 

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో పల్లెలు అన్ని సుభిక్షంగా ఉన్నాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. దేశం లో నిజమైన గ్రామ స్వరాజ్యం తెచ్చిన ముఖ్యమంత్రి   వైఎస్ జగన్ అని కొనియాడారు. అనేక సంస్కరణలతో ప్రజలు హర్షించేలా పాలన సాగిస్తున్నారని అన్నారు మంత్రి. ఉమ్మడి ఆంధ్రపదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి పథకాలు ఇంత పారదర్శకంగా అందించలేదని, నేరుగా ఖాతాల్లో కి నిధులు జమ చేసి మధ్యవర్తులు లేకుండా చేశారని తెలిపారు. మంచి నిర్ణయాలు తీసుకుని అద్భుతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి   వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలిచి, రానున్న ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీ తో మరోసారి భారీ విజయాన్ని అందించాలి పిలుపునిచ్చారు.

 

 

 

మరోపక్క నియోజకవర్గం లో ప్రతి చిన్న సమస్య కూడా పరిష్కారించేలాnకృషి చేస్తున్నట్లు వివరించారు. గతంలో అనేక కారణాలు వలన పూర్తి స్థాయి అబివృద్దికి నియోజకవర్గం నోచుకోలేదని, ఆ అభివృద్ధి మొత్తాన్ని మూడేళ్లలో సిఎం   వైఎస్ జగన్ సహకారం తో చేసుకున్నామన్నారు. ఇప్పటికే మండలంలో రోడ్లు దాదాపుగా పూర్తి చేశామని, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఇప్పటికే సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు మంత్రి. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశాక గతంలో లాగా పెద్దగా ఫిర్యాదులు అందట్లేదని,దృష్టికి వచ్చిన అన్ని చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నట్టు తెలిపారు.

 

 

మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాట కార్యక్రమం సందర్భంగా మండలం లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి పల్లెలో గ్రామస్తులు భారీగా స్వాగత ఏర్పాటు చేశారు. మహిళలు హారతి పడుతూ స్వాగతం పలికారు. పల్లెబాట పర్యటనలో బాగంగా పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పొట్టిసిద్దారెడ్డిగారిపల్లిలో 10 మందికి పైగా టిడిపి నాయకులు, కార్యకర్తలు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. వారికి వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్యక్రమంలో చిత్తూరు ఎంపి   ఎన్.రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్   గోవిందప్ప శ్రీనివాసులు, టిటిడి బోర్డ్ సభ్యులు   పోకల అశోక్ కుమార్, ఎంపిపి    సురేంద్ర నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Peddireddy Ramachandra Reddy, the state minister who took up the village walk program in Pulicharla mandal

Post Midle