Natyam ad

పిలేరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన

పిలేరు ముచ్చట్లు:

పిలేరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన.గుర్రం కొండ మండలం చెర్లోపల్లి లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.కార్యక్రమంలో పాల్గొన్న పీలేరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  చింతల రామచంద్రారెడ్డి

Post Midle

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…..

13న జరిగే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గుర్తు పై ఓటు వేయాలి.ఎమ్మెల్యేగా  చింతల రామచంద్రారెడ్డి, ఎంపీగా శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హ్యాట్రిక్ సాదించనున్నారు.వీరిద్దరూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నారు.కిషోర్ కుమార్ రెడ్డి పై గతంలో చంద్రబాబు ఎర్రచందనం వీరప్పన్ అని విమర్శలు చేశారు.నేడు ఆయనకే టికెట్ ఇచ్చి టిడిపి నుండి పోటీ చేయిస్తున్నారు.కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు సహకారం, జగన్ అరెస్టు చేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు.జగన్ ను అరెస్టు చేస్తే ముఖ్యమంత్రి కి కాకుండా మరెవరికీ సంబంధం ఉంటుంది.కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయం గా అండగా నిలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి వెన్నుపోటు పొడిచాడు.రాష్ట్రానికి రాజధాని లేకుండా విభజించి ఎపి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు.ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన ఘనుడు కిరణ్ కుమార్ రెడ్డి.

 

 

చంద్రబాబు మామ కి మాత్రమే వెన్నుపోటు పొడిచాడు… కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి, వైఎస్ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచాడు.పుట్టపర్తి సత్యసాయి బాబా చనిపోతే… బ్రతికే ఉన్నాడని చెప్పి ఆయన ఆస్తులు దోచుకున్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి.కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి పై ప్రమాణం చేస్తారా అని మిథున్ రెడ్డి సవాలు విసిరితే దానికి సమాధానం ఉండదు.అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం అని చెపితే వీరికి మాట్లాడే పరిస్థితి లేదు.చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్, లోకేష్ కి చెప్పుకోవడానికి ఏమి లేవు.అందుకే ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ ను, మంత్రులను తిడుతూ సభలు పెడుతున్నారు. వైఎస్ జగన్ చెప్పాడంటే చేస్తాడంతే. ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశారు.ఎమ్మెల్యేగా  చింతల రామచంద్రారెడ్డిని, ఎంపీగా  పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నా.వారిద్దరూ పీలేరు అభివృద్ధికి నిరంతరం శ్రమించారు.

 

Tags:Peddireddy Ramachandra Reddy’s visit to Pileru Constituency

Post Midle