పేదల పెన్నిది మంత్రి పెద్దిరెడ్డి- సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి
– ఘనంగా మంత్రి పెద్దన్న జన్మదిన వేడుకలు
రామసముద్రం ముచ్చట్లు:

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిదిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందరి మన్ననలు పొందుతున్నారని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. బుధవారం స్థానిక సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారనడంలో ఎటువంటి అథియోశక్తి లేదన్నారు. గత కొన్నేళ్లుగా పదవితో పనిలేకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. జిల్లాలో తాగునీరు, ఆలయాలు నిర్మాణాలకు విరివిగా విరాళాలు ఇచ్చి సామాన్య ప్రజల మనసుల్లో ముద్ర వేసుకున్నారన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో తన అనుచర గణాన్ని ఏర్పరుచున్నారన్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 13 నియోజకవర్గాల్లో వైకాపా ఎమ్మెల్యేలు గెలుపొందడానికి కారణమైయ్యారని మంత్రి పెద్దిరెడ్డిను కొనియాడారు. అలాంటి మహోన్నత వ్యక్తిత్వం కల్గిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి జన్మదిన కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మూర్తి, శ్రీనివాసులు, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, వాలింటర్లు రేవతి, మేఘన, రెడ్డెమ్మ, పుష్పావతి, శ్రావణి, దినకర్, కుమారస్వామి, హరీష్, ప్రదీప్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Tags: Peddireddy, Sarpanch Srinivasulureddy, Minister of Poor People
