పెద్దిరెడ్డి కుటుంబం వెంటే నడుస్తాం…

Peddireddy's family walks in ...

Peddireddy's family walks in ...

– వైఎస్సార్సీపి సంబరాలలో నేతల వెల్లడి

Date:28/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులో వైఎస్సార్సీపి ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడవ సారి ఎన్నిక కావడం, రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి విజయం సాధించడంపై మండల ప్రజలు సంబరాలు చేసుకున్నారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఎంపిపి నరసింహులు, జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌ కలసి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతలు వైఎస్సార్సీపి జిందాబాద్‌…పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిందాబాద్‌…మిధున్‌రెడ్డి జిందాబాద్‌ అంటు నినాదాలు చేశారు. ఈ సభలో భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పాలన తిరిగి రాష్ట్రంలో రావడం అదృష్టమన్నారు. ప్రజల ప్రభుత్వంగా వైఎస్సార్సీపి చరిత్ర సృష్టిస్తుందని కొనియాడారు. జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ ప్రజలు ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేను, ఎంపిని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆహర్నిశలు ప్రజాసేవ చేస్తున్న పెద్దిరెడ్డి కుటుంబం వెంటే తామంతా నడుస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా వైఎస్సార్సీపిని గెలిపించి, పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి , రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, నాగరాజారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌ షరీఫ్‌, ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, పార్టీ నేతలు తులసెమ్మ, వరుణకుమారి, రామచంద్రారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి , ఖాదర్‌బాషా, నారాయణరెడ్డి, కిట్టా, నాగభూషణరెడ్డి తో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు , పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

 

ఆర్టీసి డిపోకు వీడిన చందగ్రహణం

Tags: Peddireddy’s family walks in …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *