చౌడేపల్లెలో సుధాకర్‌పై పీడీయాక్ట్ నమోదు

చౌడేపల్లె ముచ్చట్లు:

కర్నాటక మధ్యం రవాణా, విక్రయ కేసుల్లో కీలకపాత్ర పోషిస్తున్న టి.సుధాకర్‌(30) పై పీడి యాక్ట్ నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవికుమార్‌ ఆదివారం తెలిపారు. గడ్డంవారిపల్లె పంచాయతీ బత్తలాపురంకు చెందిన కృష్ణప్ప కుమారుడు తుమ్మరగుంట సుధాకర్‌ కర్నాటక మధ్యంను సరిహద్దు ప్రాంతం నుంచి ఆంధ్రాకు రవాణా చేయడం , మండలంలోని పలు ప్రాంతాలకు విక్రయిస్తుండటంతో ఇప్పటి వరకు అతనిపై ఆరు సార్లు పోలీసులకు పట్టుబడి , కేసు నమోదు చేశారన్నారు. అతని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో జిల్లాకలెక్టర్‌ హరినారాయణ్‌ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి సూచనల మేరకు పీడియాక్ట్ నమోదు చేసి, కడప సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

Tags: Pediatric registration on Sudhakar in Choudepalle

Leave A Reply

Your email address will not be published.