Pediatrics on evil spirits going to the temples

ప్రార్థనాలయాల జోలికి వెళ్లే దుష్టశక్తులపై పీడీయాక్ట్

– సీఐ గంగిరెడ్డి

Date:23/09/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రార్థనాలయాలు, దేవాలయాల జోలికివెళ్లే దుష్టశక్తులపై కఠిన చర్యలు తీసుకుని, పీడీయాక్ట్ను నమోదు చేస్తామని సీఐ గంగిరెడ్డి హెచ్చరించారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు పట్టణంలోని ఆలయాలకు, మసీదులకు , చర్చిల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ఆయా ఆలయాలకు, ప్రార్థనాలయాలకు కమిటిలను ఏర్పాటు చేసి, కమిటిల పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపట్టి, రాత్రి సమయాలలో పహారా ఏర్పాటు చేశామన్నారు. అలాగే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించామన్నారు. వీటితో పాటు పోలీసులు 24 గంటలు పర్యవేక్షణలో ఉండేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కులాల మధ్య చిచ్చురేపేలా ప్రవర్తించినా, ప్రార్థనాలయాల జోలికి వెళ్లినా క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, పీడీయాక్ట్లు నమోదు చేస్తామన్నారు. ఇందులో ఎంతటి వారి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇలాంటి అరాచక శక్తుల ఆటకట్టించేందుకు ప్రజలు తమకు అందిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు అందించాలని, సంఘ విద్రోహుల ఆటకట్టించేందుకు పోలీసులతో భాగస్వామ్యంకావాలని కోరారు.

పుంగనూరులో 10 నిమిషాల్లో రేషన్‌కార్డు మంజూరు

Tags: Pediatrics on evil spirits going to the temples

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *