Natyam ad

ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని కాపాడిన పీవీ నర్సింహారావు

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

విజయవాడ ముచ్చట్లు:


క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత పీవీ నరసింహా రావు అని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజ నాథ్ కొనియాడారు. ప్రధానమంత్రిగా వినూత్న విధానాలను అనుసరించి దేశ సంపదను గణనీయంగా పెంచిన దివంగత పీవీ నర్సింహారావు స్ఫూర్తిగా ముందుకు సాగాలన్నారు. మంగళవారం మాజీ ప్రధాని పీ.వీ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ప్రధానిగా పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశం ఆర్థికంగానే కాకుండా అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందని అన్నారు. సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ఆయన కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఆయన నాయకత్వ దార్శనికత దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని, పీవీ అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుదామని శైలజనాథ్ పిలుపునిచ్చారు.

 

Post Midle

Tags: Peevi Narsimha Rao saved the country with economic reforms

Post Midle