Penalties for harming women

మహిళలకు హానికలిగిస్తే శిక్షార్హులు

– జడ్జి బాబునాయక్‌

Date:25/09/2020

పుంగనూరు ముచ్చట్లు:

సమాజంలో మహిళలు , మైనర్‌ బాలికలకు ఎలాంటి హాని కలిగించిన వారు చట్టరీత్యా శిక్షార్హులని పుంగనూరు సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌ అన్నారు. శుక్రవారం వెలుగు కార్యాలయంలో మహిళలతో కలసి న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ వివాహా సమయంలో వరకట్న కానుకలు ఇవ్వడం, తీసుకోవడం నేరమన్నారు. అలాగే మహిళలను శారీరకంగా, మానసికంగా వేధించినా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే మైనర్‌ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, కిడ్నాప్‌లు చేసినా శిక్షార్హులన్నారు. ముఖ్యంగా మహి ళలు బ్రూణహత్యల విషయంలో జాగ్రత్తలు వహించాలన్నారు. ఆసుపత్రుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో స్కానింగ్‌ చేయడం, వాటి వివరాలను తల్లిదండ్రులకు తెలపడం నేరమన్నారు. సమాజంలో మహిళలు, వృద్ధులు , బాధితులు ఎవరైనా న్యాయం కోసం లీగల్‌ సర్వీసస్‌ అథారిటిని సంప్రదిస్తే ఉచిత న్యాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ప్రజలు అవగాహన కలిగి, నేరాలను అరికట్టడంలో ముందుకురావాలన్నారు. మనకెందుకులే అన్న నిర్లక్ష్యం ధోరణిని వీడనాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు పులిరామకృష్ణారెడ్డి, మండల ఏవో రాజేశ్వరి, సీవోలు గురుమూర్తి, గంగోజి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు,

పంటలసాగుపై రైతులు అవగాహన పెంచుకోవాలి

Tags: Penalties for harming women

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *