రోడ్లపై చెత్తను పడవేస్తే జరిమానాలు విధిస్తాo

Penalties will be imposed if garbage is thrown on roads

Penalties will be imposed if garbage is thrown on roads

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:19/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో ఎక్కడైనా రోడ్లపైన , ఖాళీ స్థలాల్లో చెత్తను పడవేసినా, బహిరంగ మలమూత్ర విసర్జన చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తే జరిమానాలు విధించి, కేసులు నమోదు చేస్తామని కమిషనర్‌ కె ఎల్‌.వర్మ హెచ్చరించారు. శుక్రవారం ఆయన పట్టణంలోని హైస్కూల్‌వీధి, బజారువీధి, కొత్తపేట, ఆర్టీసి బస్టాండు, ఎంబిటి రోడ్డు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు రోడ్లపై చెత్తను వేయడంపై అగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్భంధిగా అమలు చేస్తున్నామన్నారు. కానీ ప్రజలు నిర్లక్ష్యంగా చెత్తను బయటవేయడం బాధకరమన్నారు. దీని కారణంగా ఈగలు, దోమలు ప్రభలి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. తడిచెత్త, పొడిచెత్తను వేరుచేసి, మున్సిపల్‌ కార్మికులకు అందజేయాలని ప్రజల్లో చైతన్యం కలిగించి, డస్ట్బిన్లను పంపిణీ చేశామన్నారు. దీంతో పాటు హ్గంకంపోస్ట్ విధానాన్ని అలవర్చుకోవాలని సూచించడం జరిగిందన్నారు. కానీ ప్రజలు ఈ విషయంలో నిర్లక్ష్యం చేయడంతో పారిశుద్ధ్యానికి విఘాతం కలుగుతుందన్నారు. అలాగే ప్లాస్టిక్‌ కవర్ల నిషేదానికి ఆకస్మిక తనిఖిలు చేసి, కవర్లను వినియోగించినా, విక్రయించిన వారి దుకాణాలు సీజ్‌ చేసి, లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ , కార్మికులు పాల్గొన్నారు.

కుక్కలను తరలించారు….

పట్టణంలో కుక్కల బెడద తీవ్రం కావడంతో కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో ఉద్యోగులు కుక్కలను పట్టుకుని మదనపల్లె కేంద్రానికి తరలించారు. అక్కడ కుక్కలకు వ్యాక్సిన్లు వేసి , తిరిగి పట్టణంలో వదలనున్నారు. దీని ద్వారా కుక్కకాటుతో ఎలాంటి ప్రమాదం లేకుండ చర్యలు చేపట్టారు.

కమిషనర్‌ వర్మ, సీఐ గంగిరెడ్డికి సన్మానం

Tags; Penalties will be imposed if garbage is thrown on roads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *