Natyam ad

ఒకటోవ తేదీనే పెన్షన్

కాకినాడ ముచ్చట్లు:


రాష్ట్ర వ్యాప్తంగా  మూడు లక్షల పదివేలు మంది లబ్ధిదారులకు వైయస్సార్ పెన్షన్ కానుక ద్వారా ఒకటో తేదీన పెన్షన్ అందించడం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు.  కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని మండల కేంద్రం కరప మండల  ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వృద్ధులకు నూతనంగా మంజూరైన వైయస్సార్ పెన్షన్ కానుక  ద్వారా మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎంపీడీవో స్వప్న అధ్యక్షులు జరిగిన ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని అవ్వ ,తాతలకు వైయస్సార్ పెన్షన్  డబ్బులును అందించారు .ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మీ సత్తిబాబు, వైస్ ఎంపీపీ భీమన్న, మండల వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు, తాసిల్దార్ శ్రీనివాస్,అధిక సంఖ్యలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

 

Tags: Pension on the first date

Post Midle
Post Midle