Natyam ad

అర్హులందరికీ పెన్షన్లు

*27 వ డివిజన్ లో పెన్షన్లు అందజేసిన డాక్టర్ మేయర్ శిరీష
*ఆదివారం ఉదయం 27 వ డివిజన్ లో కొత్త పెన్షన్లు 12, పాతవి 219, మొత్తం 231
*ఉదయం ఐదు గంటలకే పెన్షన్లు అందజేసిన సచివాల సిబ్బంది, అధికారులు
*అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తాం
*నగరపాలక సంస్థ మేయర్ శిరీష
 
అమరావతి ముచ్చట్లు:
 
నూతన సంవత్సర శుభాకాంక్షలతో అవ్వా తాతలకు ప్రేమతో జగనన్న ప్రభుత్వం పెంచి ఇస్తున్న వై.యస్.ఆర్ పించను కానుకఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు వృద్ధులు, వితంతువులకు, వికలాంగులు మరియు ఒంటరి మహిళ వై.యస్.ఆర్ పెన్షన్లు కానుక సర్వం సిద్ధం చేయడం జరిగింది. ఆదివారం నుండి 2500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఐదు రోజుల పాటు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.నేటి నుండి పెన్షన్లు ఆయా డివిజన్లో ఇంటి వద్దకే పెన్షన్లు అందజేయడం జరుగుతుంది.
 
 
 
వై.యస్ .ఆర్ పెన్షన్ కానుక : – ఈ పధకం క్రింద వృద్దాప్య పెన్షన్ (OAP), వితంతువులు, నేత కార్మికులు, టోడీ టాపర్లు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు మరియు PLHIV (ART పెన్షన్‌లు) ఒక్కరికి ఇదివరకు రూ. 2,250/-ఇస్తునారు , ఇప్పడు నూతన సంవత్సర శుభాకాంక్షలతో వీరికి అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వై.యస్ జగన్ మోహన్ రెడ్డి  వాగ్థానం మేరకు రూ . 2,500/-. అక్షరాల రెండు వేల ఐదువందల రూపాయలు పెంచడం జరిగినది.అంతేకాకుండా వికలాంగులు, డప్పు కళాకారులకు మరియు హిజ్రాలకు ఒక్కరికి మూడు వేల రూపాయల చొప్పున మరియు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి గ్రస్తులకు , తలసేమియా, సైకిల్ సెల్ అనీమియా వ్యాధి గ్రస్తులకు, తీవ్ర హిమోఫిలియా వారికి ఒక్కరికి పదివేల రూపాయల చొప్పున ప్రతి నెల పించను రూపములో ఇవ్వడం జరుగుతునది.వై.యస్ ఆర్ ప్రభుత్వము వచ్చినప్పుడు నుండి (2019 జూన్) నుండి ఇప్పటి వరకు కొత్తవి 6795 పించన్లు కు రూ 1,80,68,500 అక్షరాల ఒక కోటి యనబై లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినారు (ఇందులో 583 కొత్త పెన్షన్లు డిసెంబర్ 21 కి వచ్చినవి)
 
 
ఇప్పడు ప్రస్తుత డిసంబరు 21 తేది నాటికి వై.యస్.ఆర్ పింఛను కానుక కింద ఇప్పటి వరకు వివిధ రకాల పింఛనుల కింద పదేన్మిది వేల రెండు వందల అరవైఆరు మందికి (18266) మందికి, నాలుగు కోట్ల డబై ఏడు లక్షల దబై ఆరు వేల రూపాయలు (రూ.4,77,76,000/-) పింఛనలు ఇవ్వడం జరుగుతుంది.
లబ్దిదారులు సమాఖ్య మొత్తము
Before 2019 – 13,609 2,95,66,500/-
Up to 2022 18266 4,77,76,000/-
(583 కొత్త పించన్లు కలిపిన మొత్తము రూ.15,53,000/-)ఈ కార్యక్రమంలో మేయర్ వారితోపాటు 27 డివిజన్ వైయస్సార్ సిపి నాయకులు తులసి యాదవ్, భరణి యాదవ్, సురేష్, హేమంత్, గీత, హేమ, సచివాలయ సిబ్బంది అడ్మిన్ సెక్రెటరీ గోపాలకృష్ణ, వాసు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Pensions for all eligible