Natyam ad

పెనుకొండ ఎమ్మెల్యే టికెట్ శంకరనారాయణకి ఇవ్వాలి

పెనుగొండ ముచ్చట్లు:

శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం వైసిపి రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పెనుగొండ నియోజకవర్గం లో వైసిపి అధికారం చేపట్టిన తర్వాత శంకర్ నారాయణ ఎమ్మెల్యేగా గెలిచాడు. అదృష్టం వరించింది శంకర్ నారాయణ కు మంత్రి పదవి రావడం పెనుగొండకు శుభ పరిణామంగా భావించారు వైసీపీ నేతలు. కానీ వైసీపీ నేతలు అనుకున్నట్టుగా శంకర్నారాయణ ఎవరికీ సహకారం అందించలేదని, రెడ్డి కులస్తులను అనగదొక్కారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొరపెట్టుకున్నారు. ఈ పరిణామాలన్నీ గమనించిన ఐ కమాండ్ శంకర్ నారాయణ కు టికెట్ ఇవ్వకుండా నేడు ఉష శ్రీ చరణ్కు ఇవ్వడం కొంతమంది పెనుగొండ నియోజకవర్గంలో నేతలకు మింగుడు పడడం లేదు.
శంకర్ నారాయణపు తప్ప వేరే వారి కి టికెట్ ఇస్తే మేము సహకరించేది లేదని సోమందేపల్లి, రుద్దం, గోరంట్ల, పెనుకొండ మండలానికి చెందిన నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి తెగేసి చెప్పారు. ఈ నియోజకవర్గంలో దాదాపుగా పది సంవత్సరాలు పనిచేసిన శంకర్ నారాయణ కు తప్ప వేరే  అనుభవం లేని వారికి ఇవ్వడం ప్రత్యర్థులకు మనం అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుందని తెలియజేశారు.

 

Post Midle

Tags: Penukonda MLA ticket should be given to Shankaranarayana

Post Midle