విషజ్వరాల పట్ల ప్రజలకు అవగాహన

People are aware of the toxic effects

People are aware of the toxic effects

Date:18/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని ప్రజలకు విషజ్వరాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వెహోబైల్‌ మలేరియా డెంగ్యూ క్లినిక్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. మంగళవారం నగిరివీధి, తేరుమానువీధితోట, ఏవిరావువీధి ప్రాంతాలలో మలేరియా , డెంగ్యూ వ్యాదుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు దోమలు నుంచి వచ్చే జ్వరములు రాకుండ ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల ద్వారా వ్యాపించే జ్వరాలు నివారణ నిరోధక చర్యలను గూర్చి వివరించారు. అలాగే నివాస గృహాల మధ్య దోమలు ప్రభలు ప్రజలు వ్యాదులకు గురికాకుండ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

 

అలాగే 236 గృహాలలో పరిశీలించి 34 గృహాలలో లార్వాలను గుర్తించి ప్రజలకు చూపించి, మున్సిపల్‌ సిబ్బందిచే అబేటుతో పిచికారి చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరి ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సప్ధర్‌, సభ్యులు అమరనాథ్‌, రవిచంద్రన్‌, రాజశేఖర్‌, ప్రసాద్‌రావు, నాగార్జున, గజరాజ, తదితరులు పాల్గొన్నారు.

హనుమంతునిపై వేంకటాద్రిరాముడు

Tags: People are aware of the toxic effects

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *