Natyam ad

రాహుల్ యాత్రను ప్రజలు పట్టించుకోవడంలేదు

తిరుమల ముచ్చట్లు:


తిరుమల శ్రీవారిని బిజేపి నేత విష్ణు వర్థన్ రెడ్డి దర్శించుకున్నారు.. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియా మాట్లాడుతూ… ఏపి రాజకీయాలు దేశ ప్రజలలో ఆందోళన నింపుతున్నాయి అన్నారు.. లోకల్ పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో అభివృద్ధి నిరోధక పాలనే సాగుతుంది అన్నారు.. ఆంధ్రప్రదేశ్ టిడిపీ పాలనలో పదేళ్ళు, వైసిపీ పాలనలో మరో ఇరవై ఏళ్ళు అభివృద్ధిలో వెనక్కు నెట్టబడింది అని తెలిపారు.. కుటుంబ పాలనే పరమావధిగా నాడు టిడిపీ, నేడు వైసిపీ వ్యవహరిస్తున్నాయని అన్నారు.. మిగిలిన ఈ 18 నెలలు వైసిపీ చేతగానితనాన్ని ఎండగట్టే విధంగా బీజేపీ, జనసేన ప్రజా అవగాహన ఉద్యమాలు చేపడుతుంది అన్నారు.. రాష్ట్రం అభివృద్ధి పధంలో నడవాలి అంటే అది కేవలం బిజేపీ, జనసేనలతోనే సాధ్యం అన్నారు.. తెలుగు రాష్ట్రాల విభజన తరువాత తెలంగాణనలో టిఆర్ఎస్ ఆడుతున్న రాజకీయ క్రీడ ప్రమాదకరమైనది అన్నారు.. సంతలో పశువుల్లా కొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గత మూడు రోజులుగా నీచ రాజకీయాలు చేస్తున్నారు అని తెలిపారు.. నేడు దేశంలో ఉనికి కోసం పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అనీ రాహుల్ పాదయాత్రను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అన్నారు.. 2024లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా సైతం దక్కదు అన్నారు.

 

Tags: People don’t care about Rahul’s trip

Post Midle
Post Midle