Madanapalle Sub-Collector fame Jessica promoted and transferred

ప్రజలు అధైర్యపడవలసిన అవసరం లేదు: సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి.

Date:07/05/2020

మదనపల్లి ముచ్చట్లు:

గురువారం సాయంత్రం స్థానిక జిల్లా ఆసుపత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మదనపల్లె మండలానికి చెందిన దండువారి పల్లి, ఒంటిమిట్ట గ్రామాలకు కు చెందిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు చెన్నై నుండి 4 వతేదీన వేరు వేరు లారీలలో పుంగనూరు చేరుకొని వారు స్వచ్చందంగా పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మేము చెన్నై నుండి వచ్చాము, మాకు కరోనా పరిక్షలు చేయాలని మాకు ఎలాంటి ఇబ్బంది లేదంటేనే సొంత గ్రామాలకు వెళ్తామని డాక్టర్ లకు తెలపగా, డాక్టర్లు మదనపల్లె జిల్లా ఆసుపత్రికి వెళ్ళాలని వారి కి తెలపగా డాక్టర్లు సూచనల మేరకు వారి బందువులకు ఫోన్ చేసి 2 టు వీలర్ లు తెప్పించుకుని 5 వ తేది సాయంత్రం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోగా, ఇక్కడ పరిక్షలు చేయగా పాసిటివ్ రావడం తో కంఫర్మ్ చేసుకొనుటకు తిరుపతి కి పంపించగా ఒకరికి పాజిటివ్, ఒకరికి నెగటివ్ వచ్చిందని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని చిత్తూరు ఆసుపత్రికి పంపించడం జరిగుతుందని, నెగటివ్ వచ్చిన వ్యక్తిని ఐసోలేషన్ కేంద్రం లో ఉంచడం జరుగుతుందని తెలిపారు. వీరు అవగాహనా కలిగిన వ్యక్తులు గనుక ఎవరితో కలవకుండా ఉండడం వల్ల మదనపల్లె పట్టణ ప్రజలు అధైర్యపడవలసిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ పి, రవి మనోహరా చారి, డిప్యూటి డి ఎం & హెచ్ ఓ డాక్టర్ లోక వర్ధన్, సుపెరిండెంట్ రామమూర్తి నాయక్, మునిసిపల్ కమీషనర్ జి.రవి, తహసీల్దార్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

మదనపల్లిలో తొలి కరోనా కేసు నమోదు

Tags: People don’t need to be discouraged: Sub-collector fame.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *