Natyam ad

పవన్ ను జనం నమ్మరు

నెల్లూరు ముచ్చట్లు:

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం పై పవన్ చేసిన విమర్శలను అయన  ఖండించారు. వైసిపి ప్రభుత్వాన్ని పీకేసేంత సత్తా నీకు లేదని తెలుసుకో పీకె. నువ్వు చంద్రబాబు దత్తపుత్రుడివని  రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరందరూ  కట్టకట్టుకుని వచ్చినా  2024 లో విజయం వైసీపీ దే. 2024 ఎన్నికలలో విజయం సాధించి ప్రతిపక్షమే లేకుండా చేస్తాం. సినిమాలతో పాటు చంద్రబాబు స్ర్కిప్ట్ లకు కూడా నటించే నిన్ను జనం నమ్మరు. ముందు నువ్వు పోటీ చేసే సీటు గెలిచేందుకు ప్రయత్నించు. అభిమానులు పవన్ కళ్యాణ్ వెంట తిరగడం మానుకోండి. ఆయన సీఎం అవ్వడం ఓ కలగానే మిగిలిపోతుందని అన్నారు.

 

Tags: People don’t trust Pawan

Post Midle
Post Midle