స్వీయ నిర్భంధంలోకి జనాలు

Date:23/06/2020

ఒంగోలుముచ్చట్లు:

తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అన్ లాక్ చేస్తుంటే జనం లాక్ చేసే దిశగా అడుగులు వేస్తున్న విచిత్ర పరిస్థితి ఏర్పడింది. వైరస్ మహమ్మారికి జనం ఇప్పుడు తీవ్రంగా భయపడుతున్నారు. కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ ను వదలడం లేదు. తాజాగా ఒక్కరోజే 443 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజులోనే ఐదుగురు కరోనాతో మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 9,372 మందికి కరోనా సోకింది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 44 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. కరోనాతో ఏపీలో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 111కు చేరుకుంది. ఇప్పటివరకూ 4,435 మంది కరోనా చికిత్స నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ కూడా కరోనాపై సమీక్ష నిర్వహించారు. 90 రోజుల్లో అందరికీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారుఅత్యధిక సంఖ్యలో కేసులు బయటపడుతుంటే అంతా హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో తమంతట తాముగా నిర్బంధాలను విధించుకోవడం మంచి పరిణామాంగానే చెప్పాలి. జనంలో చైతన్యం పెరగడంతో వైరస్ నుంచి తప్పించుకోవడంపై ఎవరికి వారే జాగ్రత్తలు పాటిస్తుండటం గమనార్హం.

 

 

తెలుగు రాష్ట్రాల్లో తమకు లాక్ డౌన్ పెట్టేయండి అంటున్నారు కొన్ని ప్రాంతాలు కు చెందిన వారు. ఉదాహరణకు ఎపి ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉండే ప్రాంతం మంగళగిరిలో కేసుల సంఖ్య పెరిగిపోతుంది. దాంతో మంగళగిరి ఎమ్యెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి లాక్ డౌన్ పెట్టాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లోని హోల్ సేల్ వ్యాపారులు స్వయంగా లాక్ డౌన్ ఆంక్షలు పెట్టుకున్నారు. ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించాలని తీర్మానించడం విశేషం.

 

 

ఇదే రీతిలో ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కేసుల సంఖ్య పెరగడంతో వ్యాపారులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే కార్యకలాపాలకు నిర్ణయం తీసుకున్నారు. ఇలా వివిధ వర్గాలు తామంత తామే వైరస్ కట్టడికి కార్యాచరణ ప్రకటిస్తున్నాయి. పూర్తిస్థాయి లాక్ డౌన్ తో కార్యకలాపాలు స్తంభించి ఆర్ధిక స్థితిగతి దెబ్బతింటుందని ప్రభుత్వాలు ఇక అన్ లాక్ ల వైపే అడుగులు వేస్తుంది. ఇప్పటికే ప్రధాని మోడీ సైతం లాక్ డౌన్ ల విధింపు లు ఉండవని అంతా అన్ లాక్ లే ఉంటాయని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రజలే స్వీయ నిర్బంధ లకు శ్రీకారం చుట్టుకుంటూ కేసుల సంఖ్యను బట్టి వ్యవహరిస్తూ ఉండటం విశేషం.

కన్నడ కాంగ్రెస్ లో  సీల్డ్ కవర్ రాజకీయాలు

Tags: People into self-imprisonment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *