ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Date:03/04/2020

వనపర్తి, ముచ్చట్లు:

వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని జిల్లా కలెక్టరు షేక్ యాస్మిన్ బాష తెలిపారు.అయినప్పటికీ జిల్లా ప్రజలు అప్రమతంగా ఉండాలని కోరారు.        శుక్రవారం అమే మండల  ప్రత్యేక అధికారులతో కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కరోనా వైరస్,ధాన్యం కొనుగోలు కేంద్రాలు తదితర అంశాల పై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతానికి జిల్లాలో పాజిటివ్ కేసులు లేనప్పటికీ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం నుండి ఆదేశాలు అందే వరకు ఎవరికి వారు ఇళ్లలోనే ఉండాలని ,తప్పనిసరిగా లాక్ డౌన్  పాటించాలని చెప్పారు. అధికారులు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వారి కిందిస్థాయి సిబ్బంది కూడా  కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.        జిల్లా కి మర్కజ్ నుండివచ్చిన పది మంది  శాంపిల్స్ పంపగా ఒక్కటి కూడా పాజిటివ్ రాలేదని అన్ని నెగిటివ్  వచ్చాయని కలెక్టర్ తెలిపారు. అలాగే విదేశాల నుండి 58 మంది రాగా వారిలో కూడా ఏలాంటి లక్షణాలు లేవని ,వారు 14 రోజుల క్వారన్ టైన్  పూర్తి చేసుకున్నప్పటికీ ఇంకా వారిని క్వారన్ టైన్ లొనే  ఉంచామని చెప్పారు.            ఢిల్లీ నుండి వచ్చిన వారు కలిసిన 293 మంది సెకండరీ కాంటాక్ట్స్ ను గుర్తించామని వారందరిని కూడా క్వారన్ టైన్  లో ఉంచి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు .కరోనా పాజిటివ్ ఉన్న ఒక వ్యక్తిని తన ఆటోలో తీసుకువెళ్లిన  జిల్లాకు చెందిన వ్యక్తికి సైతం  కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ ఫలితాలు వచ్చాయని అతను కూడా ప్రస్తుతం క్వారన్ టైన్ లో ఉన్నారని, మొత్తం 11 మంది ప్రస్తుతం క్వారన్ టైన్ లో ఉన్నారని వెల్లడించారు.

 

 

 

మండల ప్రత్యేక అధికారులు  మండలాల వారీగా క్వారన్ టైన్ లో ఉన్న వారు ఇళ్లలోనే ఉండేలా చూడాలని, ప్రతిరోజు మెడికల్ బృందాలు వెళ్లి రోజుకు రెండుసార్లు పరీక్షలు నిర్వహించి నివేదికలు పంపిస్తున్నారని,  ప్రత్యేకాధికారుల  ఈ విషయం పై  శ్రద్ధ తీసుకొని కోరారు. అలాగే జిల్లాకు ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారు ముందుగా 1500 మందిని గుర్తించామని, అనంతరం మరో 408 మందిని గుర్తించామని, మహారాష్ట్ర నుండి ఎక్కువమంది వచ్చారని , వారందరినీ కూడా  హోమ్ క్వారన్ టైన్ లో ఉండేలాగా ఏర్పాటు చేశా మని తెలిపారు.       ప్రత్యేకించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు ,వైద్య ఆరోగ్య డాక్టర్లతో ఇల్లుఇల్లు తిరిగి మరోసారి తనిఖీ చేస్తామని కలెక్టర్ వెల్లడించారు .ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వాళ్లందరికీ 12 కిలోల బియ్యంతో పాటు ,ఐదు వందల రూపాయల చొప్పున 9 లక్షల19 వేల రూపాయల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు .అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డులో ని ప్రతి మనిషికి ఏప్రిల్ 1 నుండి 12 కిలోల బియ్యాన్ని అందజేస్తున్నామని వెల్లడించారు.

 

 

 

బియ్యం తీసుకునేందుకు ప్రజలు సామాజిక దూరాన్ని పాటించి, చౌక ధరల దుకాణాల వద్ద నిర్దేశించిన సర్కిళ్లలో నిలబడి తీసుకోవాలని , ప్రజలు బియ్యం విషయంలో  ఏలాంటి ఆందోళన అవసరం లేదని ,ఇంకా నెల రోజులు అయినా బియ్యం ఇస్తామని, అందరికీ సరిపడా బియ్యం నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని ,ప్రతి ఒక్కరికి బియ్యం  అందుతాయని స్పష్టం చేశారు. ఈ విషయమై గ్రామాలలో చాయింపు వేయించాలని చెప్పారు.కరోనా  నియంత్రణలో భాగంగా ప్రజలు ప్రకృతి సిద్ధంగా లభించే వెల్లుల్లి ,మిరియాలు  ఆరెంజ్ ,నిమ్మ వాని వాటితో పాటు వేడి నీటిని ఆవిరి పట్టాలని, దీని వల్ల కూడా కరోనా  రాకుండా అరికట్టవచ్చని తెలిపారు .

 

 

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీల లో దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని,జిల్లాలో 233 ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, కొనుగోలు సమయంలో రైతులు ,కూలీలు సామాజిక దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని ,రైతులు కొనుగోలు కేంద్రాలకు ఒకేసారి రాకుండా నియంత్రించాలని ,ఈ విషయంపై ప్రత్యేక  అధికారులు దృష్టి సారించాలని అన్నారు. జిల్లాలో రబీలో 2.45 లక్షల మెట్రిక్ టన్నుల   మార్కెవైట్ కు రావచ్చని తెలిపారు.

 

 

గ్రామాలలో మురికి కాలువలను  శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని ,అంతేకాక తాగునీటి వనరులను శుభ్రం చేయాలని జిల్లా పంచాయతీ అధికారినిబ్ కలెక్టర్ ఆదేశించారు. అంతేకాక సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించాలని చెప్పారు. ముఖ్యంగా మురికి వాడలు, ఎస్సీ ,ఎస్టీ కాలనీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. ఉపాధి హామీ పనులను నిరంతరం కొనసాగుతాయని అయితే ఎప్పటికప్పుడు కాప్చర్  చేయాలని తెలియజేశారు.

ఆశా వర్కర్ పై దాడి

Tags:People need to be vigilant

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *