People need to raise awareness to control the corona

కరోనాను నియంత్రించేందుకు ప్రజలు అవగాహన పెంచుకోవాలి

– నోడల్‌ ఆఫీసర్‌ రాజశేఖర్‌రెడ్డి

Date:27/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

కరోనాను నియంత్రించేందుకు ప్రజలందరు ఆ వ్యాది పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని కోవిడ్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఇన్‌చార్జ్ కమిషనర్‌ రసూల్‌ఖాన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన కరోనా నియంత్రణ అవగాహన ర్యాలీ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల చే నిర్వహించారు. ఈ ర్యాలీని మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం ప్రారంభించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులకు అవసరమైన కిట్లను పంపిణీ చేసి, పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నోడల్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి రోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వ్యాది తగ్గుముఖం పట్టిందని , ప్రజలు నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ప్రజలు మాస్క్ లు ధరించి, వ్యక్తి గత పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు శానిటైజర్ల వినియోగం పూర్తి స్థాయిలో చేపట్టాలని కోరారు. కరోనా తగ్గిందని నిర్లక్ష్యం చేస్తే నష్టం ఊహించలేమని తెలిపారు. ప్రజలందరు తమకుతాముగా కరోనా నియంత్రణ కోసం కృషి చేయాలని కోరారు. ప్రభుత్వాదేశాల మేరకు ఈనెల 31 వరకు కరోనా నియంత్రణ అవగాహన సదసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు, ఆర్‌వో రామకృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌, కౌన్సిలర్‌ అభ్యర్థి అర్షద్‌అలి పాల్గొన్నారు.

చౌడేపల్లెలో బైపాస్‌ రోడ్డు ఏర్పాటుకు స్థల పరిశీలన

Tags: People need to raise awareness to control the corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *